ఇక లోక్ సభలో బాలయ్య ‘బుల్ బుల్’లు వినాలేమో?

Update: 2018-12-21 07:09 GMT
నందమూరి కుటుంబానికి కంచుకోటలాంటి హిందూపురం నియోజజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోందట. దీంతో అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణను సేఫ్ జోన్‌ కి మార్చాలని చంద్రబాబు డిసైడయ్యారట. హిందూపురంలో బాలకృష్ణ కానీ ఓడిపోతే పార్టీ పరువు పోతుందని.. అందుకే ఈసారి బాలయ్య కు హిందూపురం అసెంబ్లీ టిక్కెటివ్వరాదని నిర్ణయించుకున్నారట. నిజానికి బాలయ్యకు కూడా ఇప్పటికే ఈ సంగతి చెప్పగా ఆయన మాత్రం అదే టిక్కెట్ కావాలని కోరుతున్నట్లు సమాచారం. దీంతో మధ్యేమార్గంగా హిందూపురం నుంచే లోక్ సభకు పోటీ చేసేలా చంద్రబాబు బాలయ్య ను ఒప్పిస్తున్నారని టాక్.
    
నిజానికి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కొత్త లో బాలయ్య ఇక్కడి ప్రజల ఆదరణ పొందారు. తరచూ వచ్చేవారు. ఆ తరువాత అటు వైపే చూడకపోవడంతో ఆయన పీఏ అక్కడ రాజ్యమేలడం ప్రారంభించారు. అది బాలయ్య కు రాజకీయంగా బాగా నష్టం కలిగించింది. ప్రజల్లో బాలయ్య పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే, రాజకీయాలు పెద్దగా అర్థం చేసుకోలేని బాలయ్య ఇంకా అక్కడి ప్రజలు తనను గెలిపిస్తారనే భ్రమల్లోనే ఉన్నారట. కానీ, చంద్రబాబు సర్వేలు మాత్రం బాలయ్య కు దారుణ ఓటమి తప్పదని తేల్చేశాయట.
    
దీంతో బాలయ్యను లోక్ సభకు పంపించాలని చంద్రబాబు డిసైడయ్యారట. అయితే, ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న నిమ్మల కిష్టప్ప కూడా దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడైన కిష్టప్పకు మంత్రి పదవి చేపట్టాలన్నది కోరిక. కానీ, ఎంపీగా ఉండడంతో ఆయన కోరిక తీరడం లేదు. దీంతో గతసారే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తామన్నారు. కానీ, లోక్ సభకు సరైన అభ్యర్థిలేక చంద్రబాబు కిష్టప్పపైనే ఆధారపడ్డారు. ఈసారి అన్నీ అనుకున్నట్లు జరిగితే కిష్టప్ప హిందూపురం అసెంబ్లీకి పోటీ చేయడంతో పాటు లోక్ సభకు పోటీ చేసే బాలయ్యను గెలిపించే బాధ్యతా చేపడారని తెలుస్తోంది.


Tags:    

Similar News