ఏపీ బాటలో జార్ఖండ్ ..ఎందులో అంటే ?

Update: 2020-01-29 05:10 GMT
ఏపీలో ప్రస్తుతం రాజకీయ వేడి సెగలు పుట్టిస్తుంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఏపీ వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ లో ఆమోదింపజెసి ,మండలికి పంపగా ..అక్కడ ఆ ఏపీ వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకుంది. దీనితో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఏకంగా శాసన మండలినే రద్దు చేయడానికి అసెంబ్లీ లో తీర్మానం చేసి , కేంద్రానికి పంపారు. ఇకపోతే ఏపీ లో మూడు రాజధానులు అంటేనే ఇంతలా ప్రతిపక్షం రియాక్ట్ అవుతుంటే ..జార్ఖండ్ మాత్రం మరో అడుగు ముందే ఉంది. అక్కడ అధికారంలో ఉన్న హేమంత్ సోరెన్ సర్కార్ ఏకంగా నాలుగు రాజధానులను ఏర్పాటు చేయాలనీ ఆలోచిస్తుంది.

జార్ఖండ్ ప్రస్తుత రాజధాని రాంచిని కూడా కలుపుకొంటే మొత్తం రాజధానుల సంఖ్య ఐదుకి చేరుకుంటుంది. దుమ్కా, మేదినినగర్, ఛైబాస, గిరిధ్ ప్రాంతాలను రాజధానులను బదలాయించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అనుకున్నది అనుకున్నట్టుగా అమల్లోకి వస్తే.. దేశంలో నాలుగు రాజధానులను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంగా జార్ఖండ్ నిలుస్తుంది. వీటిలో దుమ్కా ఇప్పటికే ఉప రాజధాని గా కొనసాగుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో రాజధాని గా మార్చనుంది.

దీనికి ప్రభుత్వం ఏమి చెప్తుంది అంటే ..గిరిజనులు, ఆదివాసీల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్ అని , అభివృద్ధి లో మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, అభివృద్ధి ని వికేంద్రీకరించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలానే ఆ రాష్ట్రాన్ని కూడా పాలము, కొల్హన్, నార్త్ ఛోవానగర్ అంటూ మూడు డివిజన్లుగా విభజించారు. మూడు ప్రాంతాల్లో నాలుగు నగరాలను ఎంపిక చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. దీనిపై ప్రభుత్వం త్వరలోనే సమావేశం నిర్వహించి కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు. చూడాలి మరి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురౌతాయో ....
Tags:    

Similar News