మతం ఆధారంగా దేశం ఉండటం కంటే.. లౌకికవాదంతో కొనసాగటం మంచిదని అందరూ అనుకుంటారు.కానీ.. నేపాల్ లో మాత్రం వ్యవహారం కాస్త వేరుగా ఉంది. నేపాల్ లో సాగుతున్న లౌకికవాద దేశం అన్న మాట నుంచి.. తమ దేశాన్నిహిందూ దేశంగా మార్చాలన్న డిమాండ్ రోజురోజుకీ బలపడుతోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలనే వారిలో ముస్లింలు కూడా ఉండటం గమనార్హం. లౌకిక దేశంగా ఉండే కన్నా.. హిందూ దేశంగా నేపాల్ ఉండటమే మంచిదని ఆ దేశంలోని ముస్లింలు చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. నేపాల్ లో ఉన్న క్రైస్తవ మిషనరీలు.. స్థానికుల్ని క్రైస్తవులుగా మార్చేస్తున్నాయని.. అదే హిందూ దేశంగా ఉంటే.. అలాంటివి సాధ్యం కాదని.. అందుకే నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలని ఆ దేశ ముస్లింలు కోరుకుంటున్నారు. ఇస్లాంను కాపాడుకోవాలంటే నేపాల్ ను హిందూ దేశంగా మార్చుకోవటం తప్పనిసరి అంటూ ఆ దేశానికి చెందిన నేపాల్ రఫ్తీ ముస్లిం సోసైటీ ఛైర్మన్ అజ్మత్ చెబుతున్నారు. నిజానికి ఆయన ఒక్కరే కాదు.. ఇలాంటి వ్యాఖ్యల్ని ముస్లిం మత పెద్దలు చాలామందే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం