కరోనా ప్రభావం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వ్యాపార రంగం కుదేలైంది. ఐటీ రంగం సహా పలు రంగాలు ఆర్థికంగా చితికి పోయాయి. కరోనా సంక్షోభంతో ఎన్నో సంస్థలను మూసివేశారు. చాలా సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు సీనియర్ ఉద్యోగులను క్రమేణా తొలగించుకుంటూ వస్తున్నాయని కొన్ని సర్వే సంస్థ లు ఇటీవల పేర్కొన్నాయి. అయితే ఇది నిజం కాదని సిక్కి అనే సర్వే సంస్థ వెల్లడించింది.
గతంతో పోలిస్తే సీనియర్ ఉద్యోగులకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగినట్లు వెల్లడించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై వంటి నగరాల్లో సిక్కి సంస్థ సాఫ్ట్ వేర్ రంగం, ఇతర కంపెనీ ప్రముఖుల నుంచి వివరాలు సేకరించింది. ఎనలిస్ట్, ఇంజనీర్, టెస్టర్, డెవలపర్ వంటి విభాగాలకు చెందిన నిపుణులను సంప్రదించింది. కరోనా ఆరంభంలో కొన్ని సంస్థలు సీనియర్ ఉద్యోగులను తొలగించుకున్నా .. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సి ఉండడంతో వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సిక్కి తెలిపింది. 72 శాతం కంపెనీలు ఏడు నుంచి పదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, 28 శాతం కంపెనీలు జూనియర్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ సర్వే సంస్థ వెల్లడించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో కంపెనీలకు కొత్తగా ప్రాజెక్టులు వస్తున్నాయి.. అలాగే పెండింగ్ లో మిగిలిపోయిన ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలంటే ఎంతైనా సీనియర్ ఉద్యోగులు ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంపెనీలు, పలు సంస్థలు సీనియర్ ఉద్యోగులకు భారీ వేతనాలతో ప్రోత్సహిస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.