జమ్మూకాశ్మీర్ కోసం మరో ఉద్యమం.. ఏకమైన పార్టీలు

Update: 2020-08-22 18:01 GMT
ఇన్నాళ్లు తమలో తాము కొట్టుకున్న జమ్మూకాశ్మీర్ పార్టీలన్నీ ఇప్పుడు తమ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కోసం ఏకమయ్యాయి. తమ విభేదాలను పక్కనపెట్టి మరీ ఇందుకోసం ఉద్యమించాలని ఈ పార్టీల నాయకులంతా నిర్ణయించారు.

గత ఏడాది ఆగస్టు 5న కేంద్రం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసేసి ఆర్టికల్ 370 రద్దు చేసి  రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ చర్యను అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఖండించాయి.

తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ - పీడీపీ - పీపుల్స్ కాన్ఫరెన్స్ - సీపీఐఎం - కాంగ్రెస్ - అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. తామంతా ఒక్కతాటిపై నిలబడి జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతామని పేర్కొన్నాయి.


Tags:    

Similar News