నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక ఎటూ తేలడం లేదు. ఆ పార్టీ నుంచి పోటీచేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆశించిన వారంతా ఎంపీ టికెట్ వద్దు.. ఎమ్మెల్యే టికెట్ ముద్దు వంటూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజాగా విదేశాల్లో స్థిరపడ్డ ప్రముఖ ఎన్నారై కుటుంబానికి పిలుపునందించాడు. వారు హుటాహుటిన వచ్చి అమరావతిలో చంద్రబాబును కలిసారు.
నర్సాపురం పట్టణానికి చెందిన రావి దీపిక ఉన్నత విద్యావంతురాలు. చాలాకాలంగా ఆమె భర్త రాధాకృష్ణతో కలిసి సౌదీలో ఉంటున్నారు. సౌదీలో రాధాకృష్ణ బడా కాంట్రాక్టర్ గా అరంకో సంస్థలో చేస్తున్నాడు. వీరి కుటుంబం ఆదినుంచి టీడీపీతో అనుబంధంగా ఉంటోంది. వీరు రాజకీయాల్లో ఆసక్తితో టీడీపీ అధినేతను సంప్రదించారు. కానీ అది చాలా రోజులు సాధ్యపడలేదు.
ఇప్పుడు తాజాగా కాపు సామాజికవర్గానికి చెందిన రావి దీపికను నర్సాపురం బరిలో దించడంపై చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఎక్కువగా ఉన్న క్షత్రియ సామాజికవర్గానికే ప్రతీసారి టికెట్ కేటాయిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న కాపునేతలకు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై బాబు యోచిస్తున్నాడట.. చివరి నిమిషంలో క్షత్రియ కాకుండా కాపు సామాజికవర్గాన్ని తీసుకుంటే రావి దీపికకు టికెట్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వారు చంద్రబాబును కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక నర్సాపురం ఎంపీ సీటు కోసం కొత్త సుబ్బారాయుడు - రాజ్యసభ ఎంపీ తోట సీతారామలక్ష్మి పోటీచేయించాలని బాబు యోచించాడు. కానీ వారిద్దరూ ఆసక్తి చూపకపోవడం.. ఎమ్మెల్యే టికెట్ ఆశించడంతో రావి దీపిక పేరు తాజాగా తెరపైకి వచ్చింది.