అమెరికాలో ఎన్నారై విద్యార్థి హత్య.. రూమ్‌మేట్ అరెస్ట్

Update: 2022-10-06 04:14 GMT
అమెరికాలోని పర్డ్యూ యూనివర్శిటీలో 20 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి వరుణ్ మనీష్ ఛేడా దారుణ హత్య కలకలం రేపింది. ఈ కేసులో అతని రూమ్‌మేట్ యే నిందితుడు అని తేలింది. రూమ్ మేట్ చేతిలో హాస్టల్ లో హత్య చేయబడ్డాడని పోలీసులు తేల్చారు. అతన్ని ప్రాథమిక హత్య ఆరోపణపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన 22 ఏళ్ల జూనియర్ సైబర్ సెక్యూరిటీ మేజర్ 'జీ మిన్ షా' ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పర్డ్యూ పోలీస్ చీఫ్ లెస్లీ వైటే తెలిపారు. వైట్ ఈ నేరాన్ని కక్షతో.. తొందరపాటు క్షణికావేశంలో చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.  మనీష్ ఛేడా "మల్టిపుల్ షార్ప్ ఫోర్స్ ట్రామాటిక్ గాయాలు" కారణంగా మరణించాడు. ప్రాథమిక శవపరీక్ష ఫలితాల ప్రకారం.. అతడిది ఒక హత్య అని నివేదిక తెలిపింది.

క్యాంపస్ పశ్చిమ అంచున ఉన్న మెక్‌కట్చియాన్ హాల్ నుండి బుధవారం మధ్యాహ్నం 12:44 గంటలకు పర్డ్యూ యూనివర్శిటీ నుంచి పోలీసు విభాగానికి 911 కాల్ వచ్చిందని విశ్వవిద్యాలయ ప్రతినిధి మీడియాకు తెలిపారు. హత్య చేసిన జీ మిన్ షానే స్వయంగా కాల్ చేశారు.

పర్డ్యూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిచ్ డేనియల్స్ ఈ ఘటనపై పర్డ్యూ యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ క్షుణ్ణంగా విచారణ జరుపుతోందని ఒక ప్రకటనలో తెలిపారు. "ఇది మా క్యాంపస్‌లో జరుగుతుందని ఊహించలేదు.

ఇదో విషాదకరమైన సంఘటన. ఈ భయంకరమైన సంఘటన వల్ల ప్రభావితమైన వారందరికీ మా సానుభూతి. మా విద్యార్థుల  భద్రతకు ఏకైక అత్యధిక ప్రాధాన్యత అని నేను మీకు హామీ ఇస్తున్నాను. మా క్యాంపస్‌లో ఇలాంటివి జరగవని" అని డేనియల్స్ తన ప్రకటనలో తెలిపారు.

యూనివర్సిటీ ప్రకారం.. జనవరి 2014 తర్వాత ఇది పర్డ్యూ యూనివర్సిటీలో జరిగిన మొదటి క్యాంపస్ హత్య. ఛేడా తన 21వ పుట్టినరోజుకు కేవలం 10 రోజుల దూరంలో హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.  అతను 2020లో పార్క్ ట్యూడర్ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేట్ చేసిన సంవత్సరం నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో సెమీఫైనలిస్ట్ కావడం విశేషం. ఇంత బాగా చదివే భారతీయ ఎన్నారై ఇలా హత్యకు గురై చనిపోవడం విషాదం నింపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News