ఇప్పటితరానికి పెద్దగా ఆనాటి సంగతులు తెలియవు. 1995 ఆగస్టు 20 తరువాత మెల్లగా విశాఖ సాగర తీరాన మొదలైన రాజకీయ తుపాను మూడు రోజులు గడచేసరికి హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి ఎన్టీయార్ అధికార నివాసానికి పెను ఉప్పెనలా తాకింది. అది మరో నాలు రోజులు గడచేసరికి తీవ్ర తుపానుగా మారి ఎన్టీయార్ ముఖ్యమంత్రి సీటునే కూలదోసింది. కళ్ళు మూసి తెరచేలోపుగా ఈ విపత్కర రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
ఒక విధంగా చెప్పాలీ అంటే కేవలం పది రోజుల వ్వవధిలో అపరిమిత రాజకీయ బలవంతుడు అయిన ఎన్టీయార్ మాజీ సీఎం అయిపోయారు. అది కూడా తన కుటుంబ సభ్యుల చేతనే ఆయన ఇలా అధికారం నుంచి దించబడ్డారు. దాంతో నాటి ఉమ్మడి ఏపీ జనం నిశ్చేష్టురాలై అంతా చూసింది. తేరుకునేలోపు కొత్త సీఎం గా చంద్రబాబు వచ్చారు. నాడు ఎన్టీయార్ కి వెన్నుపోటు జరిగింది అని విపక్షాలు ఈ రోజుకీ అంటూంటే తెలుగుదేశం పార్టీని పరిరక్షించుకునేందుకు చేసిన ఉద్యమం అది అని చంద్రబాబు సహా అంతా చెబుతారు.
అయినా సరే బాబు మీద వెన్నుపోటు ముద్ర పోలేదు. తాజాగా ఎన్టీయార్ పేరును విజయవాడ హెల్త్ వర్శిటీకి మార్చినపుడు కూడా చంద్రబాబుకు, బాలయ్యకు ఎన్టీయార్ పేరెత్త అర్హత నైతికత రెండూ లేవని వైసీపీ ఘాటుగా కౌంటర్ చేసింది. అయితే వెన్నుపోటు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అది జనాల్లోకి మాత్రం అలాగే వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళూ విడివిడిగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చిన బావా బావమరుదులు అయిన చంద్రబాబు బాలయ్య ఫస్ట్ టైమ్ ఒక ఓటీటీ షోలో కలసి ఉమ్మడిగా అనాడు జరిగిన విషయాలు ఎందుకు అలా తాము చేయాల్సి వచ్చింది అని చెప్పబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.
బాలయ్య అహా ఓటీటీకి హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ రియాల్టీ షో సీజన్ టూ లో ఫస్ట్ గెస్ట్ గా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారు. ఈ షోలో బాలయ్య అవతల వారి వ్యక్తిగత విషయాలతో పాటు అన్నీ కూడా ప్రస్తావించి ఆడియన్స్ కి వినోదం తో పాటు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.
మరి బాలయ్య బాబుల మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, బాలయ్య ఎందుకు తన తండ్రి పార్టీ టీడీపీ బావ చేతులలో పదిలంగా ఉంటుందని నమ్మారు. అసలు 1995 ఆగస్ట్ లో ఏమి జరిగింది అన్నది చెబుతారా. దాని మీద బాబు మార్క్ వివరణ ఎలా ఉంటుంది. ఇవన్నీ రాజకీయాలు ఇష్టపడే వారికి ఆసక్తికరమైన వార్తలే. అదే టైమ్ లో వైసీపీకి గట్టి కౌంటర్ గా బావా బావమరుదులు ఒకే స్టేజి మీద కనిపించి బిగ్ సౌండ్ చేయబోతున్నారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఆ పొలిటికల్ మసాలా ఎలా ఉంటుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.