టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మరోమారు రణరంగంగా మారింది.
ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గతంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోనే ఉండేది. అలాగే 1983, 1985ల్లో స్వయంగా ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతిని టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
ఇదే సమయంలో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం మొదటి నుంచి తాను ఎన్టీఆర్ కుటుంబానికి వీర విధేయుడినని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వర్థంతిని కొడాలి నాని ఆధ్వర్యంలో ఆయన అనుచరులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. డిసెంబర్ 28న దివంగత నేత వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా కొట్టుకున్నట్టే మరోమారు వైసీపీ, టీడీపీ వర్గాలు తన్నులాటకు దిగాయి.
గుడివాడలో టీడీపీ నేత వెనిగళ్ల రాము ఆధ్వర్యంలో పదివేల మందికి అన్న సంతర్పణ చేశారు. అలాగే అన్న క్యాంటీన్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం భారీ ఎత్తున వర్ధంతి ర్యాలీని టీడీపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, వెనిగళ్ల రాము గుడివాడలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతిని 'ఎన్టీఆర్ ఫ్యాన్స్' పేరుతో కొడాలి నాని అనుచరులు నిర్వహించారు. అంతేకాకుండా కొడాలి నాని అనుచరులు బైక్ ర్యాలీ చేపట్టారు. దీన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో గొడవ రాజుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త చెల్లుబోయిన అనిల్‌పై నాని అనుచరులు దాడి చేశారు. ఆయన కంటికి తీవ్ర గాయమైంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. తాజా గొడవతో పోలీసులు గుడివాడలో 144 సెక్షన్ విధించారు. టీడీపీ కార్యకర్త అనిల్ కంటికి తీవ్రగాయమైనా పోలీసులు మాత్రం అతడినే బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.