ఫొటో స్టోరీ : ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌ లో కనిపించారు

Update: 2018-08-29 10:51 GMT
నందమూరి ఫ్యామిలీలో గత కొంత కాలంగా కోల్డ్‌ వార్‌ జరుగుతుందనే విషయం అందరికి తెల్సిందే. ఎన్టీఆర్‌ తో బాలకృష్ణకు మరియు చంద్రబాబు నాయుడు విభేదాలు ఉన్నాయి అనే విషయం ప్రతి ఒక్కరికి విధితమే. ఎన్టీఆర్‌ రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఉద్దేశ్యంతో వీరిద్దరు ఆయన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆ మద్య కొందరు విమర్శించారు. ఈ విషయమై హరికృష్ణ కూడా కొన్ని సందర్బాల్లో సన్నిహితుల వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తన బిడ్డపై కక్ష పూర్వకంగా వ్యవహరిస్తున్నారు అంటూ బాలకృష్ణ మరియు చంద్రబాబు నాయుడులపై హరికృష్ణ కోపంగా ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇంత వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌ లో కనిపించారు.

నల్లగొండ సమీపంలో జరిగిన యాక్సిడెంట్‌లో హరికృష్ణ మృతి చెందిన విషయం తెల్సిందే. తండ్రి మృతితో తీవ్ర కలత చెందిన ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌ లను బాలకృష్ణ మరియు చంద్రబాబు నాయుడులు ఓదార్చారు. హరికృష్ణ మరణ వార్త తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుండి హెలికాప్టర్‌ లో బయలుదేరి  నార్కట్‌ పల్లి హాస్పిటల్‌ కు చేరుకున్నారు. అక్కడ నుండి మృతదేహంతో హైదరాబాద్‌ వెళ్లారు.

నార్కట్‌ పల్లి కామినేని హాస్పిటల్‌ లో ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌ లతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు వారిని ఓదార్చాడు. ఆ సమయంలోనే అక్కడ బాలకృష్ణ మరియు నారా లోకేష్‌ కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌ - కళ్యాణ్‌ రామ్‌ ల మద్యలో చంద్రబాబు నాయుడు కూర్చుని వారితో మాట్లాడటం మీడియా కంట పడినది. ఆ ఎదురుగా బాలకృష్ణ కూడా కూర్చుని ఉన్నారు. చాలా కాలం తర్వాత ఈ అరుదైన కలయిక ఏర్పడినది అంటూ సోషల్‌ మీడియాలో నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. ఇకపై అయినా నందమూరి - నారా ఫ్యామిలీ సభ్యులు అంతా కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.

Tags:    

Similar News