తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముద్ర జారిపోతోందా? ఒక్క ఓటమి బాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తోందా? క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఇలాకాలోనే ఆయన వ్యతిరేకించే వ్యక్తిని పూజిస్తుందా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు.
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో తాజాగా ఆయనకు షాకిచ్చే పరిణామం ఒకటి సంభవించింది. చంద్రబాబును ఇన్నాళ్లు జైకొట్టిన తెలుగు తమ్ముళ్లే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. దీంతో చంద్రబాబు ఇరుకునపడ్డట్టు అయ్యింది.
తాజాగా చంద్రబాబు సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గంలో మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 40 అడుగుల ఎత్తులో భారీ జెండాను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు సహజంగానే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సడలుతోందని దీన్ని బట్టి అర్తమవుతోందంటున్నారు.
కుప్పంలో ఎన్టీఆర్ ను జైకొట్టడం ఇదే మొదటిసారి కాదు.. ఇటీవల చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబునే ఎన్టీఆర్ ను తేవాలని ప్రశ్నించారు. చంద్రబాబు దానికి ఏదో సర్దిచెప్పి ఊరుకున్నారు. కానీ తాజా పరిణామంతో కుప్పంలో రాజకీయంగా వేడి పుట్టినట్టైంది.