15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ

Update: 2022-08-29 14:05 GMT
తెలుగు లోగిళ్లలో ఏ ఇంట చూసినా.. ఏ న్యూస్‌ వీక్షించాలన్నా.. ఇప్పుడు ఎన్టీవీ.. అంతలా తెలుగు వీక్షకులు ఎన్టీవీతో కనెక్ట్‌ అయ్యారు.. 2007 ఆగస్టు 30వ తేదీన ఎన్టీవీ 24 X 7 తెలుగు న్యూస్‌ చానెల్‌ను ప్రారంభించారు.. రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరిగారు..  ఆ తర్వాత.. భక్తి టీవీ, వనిత టీవీలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.. ఆధ్యాత్మిక పరమయిన ఏ కార్యక్రమాలు చూడాలన్నా భక్తి టీవీ పెట్టాల్సిందే. మహిళల్లో మరింత చైతన్య భావాలు కలగాలంటే వనితా టీవీ చూడాల్సిందే అనేలా వాటిని తీర్చిదిద్దారు.. మహిళల కోసం దక్షిణ భారత దేశంలో తొలి చానల్‌ ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇప్పుడు ఎన్టీవీ తెలుగు న్యూస్‌ చానెల్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది.. దాదాపు గత ఏడాది కాలంగా.. తనకు సాటిలేదంటూ నంబర్‌ వన్‌గా దూసుకుపోతోంది.. అంతేకాదు 15 ఏళ్ల పండుగకు సిద్ధమైంది..

ఈ 15 ఏళ్ల ప్రయాణం అంత సులువుగా సాగింది ఏమీ కాదు.. జర్నలిజం అంటే ఒక బాధ్యత.. ఒక కట్టుబాటు.. కత్తిమీద సాము అనే చైతన్యంతో తన జర్నీని ప్రారంభించింది.. అప్పటికే 24X7 న్యూచానెళ్లు తెలుగులో ఉన్నా.. లైవ్‌లు అంతంత మాత్రమే.. ఎన్టీవీ ఎంట్రీతో ఆ సీన్‌ మారిపోయింది.. ప్రతీక్షణం.. ప్రత్యక్ష ప్రసారం.. ప్రతీక్షణం.. ప్రజాహితం అంటూ.. ఎప్పటికప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ ప్రాంతం నుంచి.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా న్యూస్‌ టెలికాస్ట్‌ చేసింది.. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. ఓబీ వ్యాన్లతో వార్తా ప్రసారాల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకెళ్లింది.. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి.. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలన్న లక్ష్యంతో.. కేవలం వార్తా ప్రసారాలకే పరిమితం కాకుండా.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యింది.

ఆది నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది ఎన్టీవీ.. విద్యార్థులు, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా జాతీయ గీతాలాపన నిర్వహించింది.. 'మన దేశం - మన గీతం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపనలో కోట్లాది మందిని కదిలించింది. ఇక, ఎన్నికల సర్వేలు అంటే ఎన్టీవీవి పెట్టింది పేరు.. ఎన్టీవీ సర్వేలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. అవి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాయి. ఇలా ఎన్టీవీ ఎప్పటికప్పుడు వార్తా ప్రసారాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తూ వచ్చింది.. అంతే కాదు.. మరో వైపు ట్రెడిషన్‌ను కూడా ఫాలో అవుతూ వచ్చింది.. కోటీదీపోత్సవం పేరుతో ప్రతీ ఏడాది ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడుపుతారంటే.. ఆ కార్యక్రమానికి ప్రజల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.. సనాత ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.. పీఠాలను, పీఠాధిపతులను, ధర్మకర్తలను ఇలా ఎంతో మందిని కోటి దీపోత్సవం పేరుతో సామాన్యులకు చేరువ చేసింది.. దిగ్విజయంగా 15వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

ఈ సుదీర్ఘ దిగ్విజయమైన జర్నీలో యాజమాన్యం కమిట్‌మెంట్‌ అసాధారణమైనది.. అదే స్థాయిలో ఉద్యోగుల నుంచి యాజమాన్యానికి అసాధారనమైన సపోర్ట్‌ లభించింది.. ఇక, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నారు చౌదరి గారు.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది.. అది మీడియా రంగాన్ని కూడా తాకింది.. అలాంటి సమయంలోనూ యథావిథిగా తన ఉద్యోగులకు సాలరీస్‌ అందించారు.. 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ.. మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆశిద్దాం..
Tags:    

Similar News