చంద్రుడిపై న్యూక్లియర్ రియాక్టర్.. నాసా సంచలనం

Update: 2022-06-29 16:30 GMT
చంద్రుడిపై మనిషి తొలి అడుగు వేసి చాలా సంవత్సరాలైంది. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌక చంద్రుడిపై అడుగుపెట్టింది. ఆ తొలి అడుగు ఖగోళ శాస్త్రంలోనే ఓ పెద్ద ముందడుగులా నిలిచిపోయింది. ఆ తర్వాత అపోలో 17 ప్రాజెక్టులో భాగంగా జియాలజిస్ట్ హారిసన్ స్మిత్.. 1972 డిసెంబర్ లో చంద్రుడి ఉపరితలంపై నుంచి రాళ్లు, ధూళి భూమి మీదకు తీసుకొచ్చాడు.  అది జరిగి 50 ఏళ్లు గడిచిపోతున్న మళ్లీ ఏ ఒక్క దేశం కూడా మానవుడిని అక్కడికి పంపలేదు.

ఈ నేపథ్యంలోనే మరోసారి అమెరికా పరిశోధన సంస్థ 'నాసా' ప్రతిష్టాత్మకమైన అర్టెమిస్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో భాగంగా 2024 నాటికి చంద్రుడి ఉపరితలంపైకి స్త్రీ పురుషులను పంపించనుంది.

చంద్రుడిపై ఎన్నో సంచలన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్న నాసా 'న్యూక్లియర్ రియాక్టర్' కూడా నిర్మించేందుకు సిద్ధమవుతోంది. నాసా, అమెరికా ప్రభుత్వం ఇందుకోసం 3 డిజైన్లను పరిశీలిస్తున్నాయి. న్యూక్లియర్ రియాక్టర్ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న రోవర్లకు పవర్ సప్లై చేయగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది పూర్తి కావాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని అంచనావేస్తున్నారు.

అర్టెమిస్ ప్రోగ్రామ్ లో భాగంగా నాసా చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషించేందుకు వినూత్న సాంకేతికతను ఉపయోగించాలని యోచిస్తోంది. అంతేకాదు.. చంద్రుడిపై ఆర్టెమిస్ బేస్ క్యాంప్ ను నిర్మించేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది.

తాజాగా డిపార్ట్ మెంట్ ఆఫర్ ఎనర్జీ కో ఆర్డినేషన్ తో అమెరికన్ కంపెనీలను 'ఫిషన్ సర్ఫేస్ పవర్ సిస్టమ్ ' డిజైన్ కాన్సెప్ట్ ల కోసం అడుగుతోంది నాసా.

దశాబ్ధకాలంలో చంద్రుడిపై ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించిన నాసా ..చంద్రుడి ల్యాండర్ లేదా రోవర్ డెక్ నుంచి పనిచేసేందుకు ఏజెన్సీకి కనీసం 40 కిలోవాట్ల శక్తిని అందించడానికి ఈ సిస్టమ్ అవసరమని పేర్కొంది.
Tags:    

Similar News