మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మను ఇస్లాం ప్రకారం క్షమించాలని జమాత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు సుహైబ్ ఖాస్మీ ఆదివారం పిలుపునిచ్చారు. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలతో ముస్లిం పండితుల సంస్థ విభేదిస్తున్నట్టు ఆయన తెలిపారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ముస్లింల నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో జమాత్ అధ్యక్షుడు ఖాస్మీ మాట్లాడారు. నుపుర్ శర్మను క్షమించాలని ఇస్లాం చెబుతోందని అన్నారు. ఆమె అవమానకరమైన వ్యాఖ్యలపై శుక్రవారం నిరసనలు తాము విభేదిస్తున్నామని చెప్పారు.
నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఖాస్మీ తెలిపారు. భారతదేశ చట్టాలను అనుసరించి తీసుకున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ఖాస్మీ అన్నారు. రోడ్డుపైకి వచ్చి పాలనను ఉల్లంఘించడాన్ని చట్టం అనుమతించదు అని ఖాస్మీ తెలిపారు. జమాత్ ఉలమా ఏ హింద్ ఫత్వా జారీ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ఎలాంటి హింసకు మద్దతు ఇవ్వవద్దని ప్రజలను కోరింది.
నుపుర్ శర్మ ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ‘అసదుద్దీన్ ఓవైసీ, మహ్మద్ మదానీలకు వ్యతిరేకంగా ఫత్వా వస్తుంది అని జమాత్ పేర్కొంది. జమాత్ ఉలమా-ఏ హింద్, అనేక ముస్లిం సంస్థలు వాటికి నిధులు సమకూర్చడంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హింసను ప్రేరేపించడానికి ఇతర ముస్లిం సంస్థలను అనుమతించబోమని స్పష్టం చేసింది.
-నుపుర్ శర్మకు భారీగా సమన్లు
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు సమన్లు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల నుంచి పోలీసులు ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కోల్ కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన న్మెల్ దంగా పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోరారు. టీఎంసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు నోటీసులిచ్చారు.
నుపుర్ శర్మ అభ్యర్థన మేరకు ఆమె హాజరు కావాల్సిన గడువును మరికొద్ది రోజులు పొడగించినట్లు మహారాష్ట్రలోని థానె జిల్లా భీవండి పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీన హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నుపుర్ శర్మకు నోటీసులు ఇచ్చినట్లు థానెలోని ముంబ్రా పోలీసులు, 25న హాజరు కావాలంటూ ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఇక బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. నుపుర్ శర్మ దిష్టిబొమ్మలను దహనం చేసి బైఠాయించడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక యూపీలో శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి 8 జిల్లాల్లో 325మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్లర్లకు సూత్రధారి జావెద్ అహ్మద్ ఇంటిని అధికారులు కూల్చివేశారు.