వారెవ్వా కిమ్ .. పిల్లలకి 90ని పాటు గొప్పదనం పాఠాలు !

Update: 2020-09-18 00:30 GMT
కిమ్ జోంగ్ ఉన్ .. ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తారు. కిమ్ 2011లో ఉత్తర కొరియా పాలకుడు కావడం కూడా ఓ సంచలనమే. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో ఆయన పాలకుడయ్యారు. ఉత్తర కొరియా మాజీ పాలకుడు, కిమ్ జోంగ్ ఇల్ 2011 డిసెంబరు 17వ తేదీన మరణించారు. అప్పటికే తన చిన్నకొడుకైన కిమ్ జోంగ్ ఉన్‌ ను తన వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా నియమితులైన యువ కిమ్ తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు పొందారు. అప్పట్నుంచి ఆయన ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటంపై ఆసక్తి ప్రదర్శించారు. ఎన్నో అణ్వాయుధాలు, క్షిపణుల పరీక్షలకు ఆదేశాలిచ్చారు. అమెరికాతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చర్యలు తీసుకున్నారు. అయన తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా ఒక సంచలనమే.

ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు గురించి తెలిస్తే.. మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు. అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురైతే సొంతవాళ్లని కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని విడుదల చేశాడు. అందులో.. తాను రెండు ఇంధ్ర దనస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాదు.. అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉదంట. దైవం పుట్టించిన కారణ జన్ముడనని కిమ్ భావిస్తుంటాడు. ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు. అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరం నడుస్తోంది. అది కిమ్ ప్రపంచం.

ఉత్తర కొరియాలో జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టిన రోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే.. కిమ్ తాత కిమ్ 2 సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వికులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను బోధిస్తారు. ఈ తరుణంలోనే ఉత్తర కొరియాలో నర్సరీ చదివే విద్యార్థులకు రోజుకు 90 నిమిషాల పాటు కిమ్ జోంగ్ ఉన్ గొప్పతనం పై పాఠాలు నేర్చుకోనున్నారు. కిమ్ సోదరి యో జాంగ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా.. గత నెల నుంచి పిల్లలకి ఈ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు ‌. ఉత్తర కొరియా నాయకత్వంపై నమ్మకం విశ్వాసం పెంచే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు.
Tags:    

Similar News