రాజకీయాల నుంచి తప్పుకున్న ఒక మాజీ ఎంపీ ప్రెస్ మీట్ పెడితే.. యావత్ మీడియా మొత్తం ఆ ప్రెస్ మీట్ ను కవర్ చేయటమే కాదు.. లైవ్ ల కోసం భారీ ఎత్తున ఓబీ వ్యాన్లను తీసుకురావటం సాధ్యమా? అంటే.. మామూలుగా సాధ్యం కాదు. కానీ.. సదరు మాజీ ఎంపీ లగడపాటి అయితే అదేమంత పెద్ద విషయం కాదు.
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి తాజాగా తన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించిన విషయం మీడియా ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన అంచనాలు ఎంత సర్ ప్రైజింగ్ గా ఉన్నాయో.. అంతే ఆశ్చర్యకరంగా ఆయన పక్క సీట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఉండటం ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ షోలో సామాన్యుడి కోటాలో ఇంట్లోకి వెళ్లి.. ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చి.. మళ్లీ వెళ్లిన ఆయన తన తీరుతో పలువురిని అకట్టుకున్నాడు. ఏదో ఒకరోజు తాను రాజకీయాల్లోకి వెళతానని చెప్పిన ఆయన.. గతంలో తాను ప్రజారాజ్యంలో పని చేసినట్లుగా వెల్లడించారు.
చిరు ప్రజారాజ్యం తర్వాత సమైక్యాంధ్ర పార్టీలో పాలుపంచుకున్న నూతన్ నాయుడు ఇటీవల హిట్ అయిన ఎఫ్ 2 సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఇంతకీ లగడపాటి పక్కన నూతన్ నాయుడు ఎందుకు కూర్చున్నట్లు? అన్న విషయానికి వస్తే.. సర్వేలో కీలకభూమిక పోషించినట్లుగా చెబుతున్నారు. బిగ్ బాస్ షోతో ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న నూతన్ నాయుడి తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.