టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తన పార్టీని దాదాపుగా క్లోజ్ చేసేసుకున్నారనే చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా విభజన చట్టం ప్రకటించినా... ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన తర్వాత అప్పటికప్పుడు మూటాముల్లే సర్దుకున్న చంద్రబాబు విజయవాడకు పరుగులు పెట్టారన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. బాబు ఇటు రాగానే తెలంగాణలో అధికార పార్టీగా టీఆర్ ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు టీ టీడీపీ నేతలంతా క్యూ కట్టేశారు. పార్టీలో తొలి తరం నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు - ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్యామిలీ కూడా టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీ నేతలను వేళ్లపై లెక్కించవచ్చంటే అతిశయెక్తి కాదేమో. కేసీఆర్ కొట్టిన దెబ్బకు కోలుకునేందుకు చాలా సమయమే తీసుకున్న చంద్రబాబు... కేసీఆర్ లా తాను కూడా ఎందుకు వ్యవహరించకూడదన్న భావనతో ఏపీలోనూ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని ఎలాగైనా బలహీనం చేయాల్సిందేనన్న భావనతో ముందుకు సాగిన చంద్రబాబు... వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 22 మంది ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎమ్మెల్సీలు - ముగ్గురు ఎంపీలను లాగేసేశారు.
ఇదంతా మొన్నటిదాకా సాగిన భాగోతం. ఇలా తమను ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీకి పంపిన పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారిలో ఓ నలుగురిని తన కేబినెట్ లోనూ చేర్చుకున్న చంద్రబాబు... ఫిరాయింపుల్లో తాను కేసీఆర్ కు తక్కువేమీ కాదని నిరూపించుకున్నారు. అంతటితో ఆగని చంద్రబాబు... ప్రస్తుతం జన హోరుతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యాత్రను పలుచన చేసేందుకు ఆ పార్టీకి చెందిన మరింత మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు యత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీకి మంచి పట్టున్న జిల్లాగా పేరున్న కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున విజయం సాధించిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరు పార్టీ ఫిరాయించేశారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఓ ఎమ్మెల్యే అసలు కనిపించడమే లేదు. ఆ ఒక్క ఎమ్మెల్యేను పక్కనబెడితే... మిగిలిన ఇద్దరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు - నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. కొడాలి నాని వైసీపీ తరఫున బలమైన నేతగా - టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతగా మనందరికీ తెలుసు. ఈ క్రమంలో కొడాలిని వెనక్కు రప్పించుకునేందుకు టీడీపీ చేస్తున్న యత్నాలేమీ ఫలించవని దాదాపుగా అర్థమైపోయింది.
అదే సమయంలో నూజివీడు సంస్థాధీశుల వారసుడిగా రాజకీయ తెరంగేట్రం చేసిన మేకా ప్రతాప్ అప్పారావు.. స్వభావరీత్యా సౌమ్యుడే. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన నియోజకవర్గాన్ని చాలా మటుకు అభివృద్ధి చేసుకున్నారు. అంతగా మాటకారి కాని ప్రతాప్ అప్పారావు... తాము బెదిరిస్తే బెదిరిపోవడం ఖాయమని, తమ పార్టీలోకి రావడం చాలా ఈజీ అని టీడీపీ భావించిందట. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలు చేసిన యత్నాలకు ప్రతాప్ అప్పారావు ఏమాత్రం లొంగలేదట. ఇలా పని కాదనుకున్న టీడీపీ... ప్రతాప్ అప్పారావు త్వరలోనే పార్టీ మారుతున్నారని, కృష్ణా జిల్లాలో వైసీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని ప్రచారం చేయడం ప్రారంభించిందట. ఈ ప్రచారం చివరకు అప్పారావు దరికీ చేరిపోయింది. మొన్నటిదాకా దీనిపై కాస్తంత సైలెంట్ గానే ఉన్న ఆయన తాజాగా తన గళం విప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత వెయ్యి కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జగన్ కు సంఘీభావంగా *వాక్ విత్ జగన్* పేరిట యాత్రలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ యాత్రలో పాలుపంచుకున్న సందర్భంగా అప్పారావు... టీడీపీ కుయుక్తులపై చాలా ఘాటుగా స్పందించారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు వైసీపీని వీడేది లేదని ప్రకటించిన అప్పారావు... తన శరీరాన్ని ముక్కలుగా కోసినా టీడీపీలో చేరేది లేదని కుండబద్దలు కొట్టేశారు. అయినా అప్పారావు ఈ విషయంపై ఏమన్నారన్న విషయానికి వస్తే.. *ప్రాణం పోయినా టీడీపీలో చేరే ప్రసక్తే లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో నాకు ఎంతగానో తోడ్పాటును అందించారు. నూజివీడులో ఎవరూ చేయనంత అభివృద్ధిని నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశాను. ప్రాణం పోయినా తాను టీడీపీలో చేరను. వైసీపీలో కొనసాగడం నా బాధ్యత. నా శరీరాన్ని ముక్కలుగా కోసినా, పార్టీ మారబోను. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు నిధులు కూడా రావడం లేదు. నేను ప్రజల మనిషిని. ప్రజలతో మమేకమై ఉంటాను. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తా. నూజివీడు అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా* అని టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యేలా అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.