ఓ కేటీయార్ ఫ్రెండూ... ఎంజాయ్ బాసూ...?

Update: 2022-05-04 12:30 GMT
అదేంటో తెలంగాణా మంత్రి కేటీయార్ కి ఇపుడు వరుణుడు ఎదురొచ్చాడు. ఏపీ ఒక నరకం,  తెలంగాణా స్వర్గం తన ఫ్రెండ్ ఒకరు ఇదే మాట తనతో  చెప్పారు అని కేటీయార్ మాట్లాడి గట్టిగా నాలుగు రోజులు కాలేదు. భాగ్యనగరం బాగు ఏంటో చూపిస్తాను అంటూ వరుణుడు పనిగట్టుకుని వచ్చి మరీ  పాలిటిక్స్ చేస్తున్నట్లుగా ఉంది అని సెటైర్లు పడుతున్నాయి.

ఓయ్ కేటీయార్ ఫ్రెండూ ఇపుడు చూడు స్వర్గం లాంటి హైదరాబాద్ ని. వాన వెలిసిన తరువాత గజానికో స్విమ్మింగ్ పూల్...అక్కడ బాగా  ఈత కొడుతున్నావా అంటూ ఏపీ నుంచి సెటైర్లు  ఒక్క లెక్కన పడిపోతున్నాయి. ఏపీలో రోడ్లు బాగులేవు, నీళ్ళు లేవు, కరెంట్ అంతకంటే లేదు అని నిన్న కాక మొన్న కేటీయార్ అన్న మాటలను మనసులో పెట్టుకున్న వైసీపీ ఫ్యాన్స్ ఇపుడు  సోషల్ మీడియాగా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఏపీ నరకం అయితే ఇపుడు హైదరాబాద్ స్విమ్మింగ్ పూల్ నా బాసూ అంటూ ఆటాడుకుంటున్నారు. హైదరాబాద్ లో గత రాత్రి భారీ వాన కురిసింది. ధాటీగా కురిపించేసిన వర్షానికి  లోతట్టు ప్రాంతాలు మాత్రం ఎప్పటిలానే జలమయమయ్యాయి. ఒక్క వర్షానికే నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. రబ్బరు బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.  ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి  ఇపుడు సెటైర్లు పేలుతున్నాయి. ఒక్క రోజు వర్షానికే ఇలా నగరం నీట మునిగితే ఎలా సారూ అంటూ వరసబెట్ట ఆ వైపున  పంచులు వేస్తున్నారు.

రాముడు లాంటి మంచి బాలుడు అయిన టీయారెస్ తారకరాముడు ఒక రోజు  ఉదయం ఏపీని నరకం అన్నా రాత్రి అయ్యేసరికి మాత్రం సర్దుకున్నారు. తాను కావాలని అనలేదు అని వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఏపీలో టీడీపీకి అది బలమైన ఆయుధం అయిపోయింది. ఒక అధికార వైసీపీకి అయితే దారుణమైన డ్యామేజ్ అయింది ఒకే ఒక్క కేసీయార్ డైలాగ్.

దాంతో అటు నుంచి వైసీపీ మంత్రులు అంతా కట్టకట్టుకుని టీయారెస్ మీద దాడి చేసినా నో యూజ్. ఏపీ మీద కేటీయార్ కౌంటర్ అంత బాగా పేలింది అన్న మాట. మరి అలా దెబ్బ తిన్న వైసీపీ ఫ్యాన్స్ కి ఇంత తొందరగా వరుణుడు చాన్స్ ఇస్తాడని అనుకోలేదేమో. భారీ గాలీ వాన వచ్చింది. భాగ్యనగరాన దంచికొడుతోంది. దాంతో ఇపుడు వైసీపీ వంతు వచ్చింది.

క్షణం కూడా లేట్ చేయకుండా కేటీయార్ ఫ్రెండూ  అంటూ తగులుకుంటున్నారు.  ఎక్కడ ఉన్నావో కానీ ఓ ఫ్రెండూ ఇపుడు నీకు హైదరాబాద్ లో అడుగడుగునా స్విమ్మింగ్ పూల్సే కదా. ఎంజాయ్ బాసూ అంటూ తెగ ఆడుకుంటున్నారు. అందుకే అంటారేమో పెద్దలు. ఎదుటివారిని ఒక మాట అంటే నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయని.
Tags:    

Similar News