చాలా చిత్రమైన సన్నివేశం తమిళనాడు రాజకీయాల్లో నెలకొని ఉందని చెప్పాలి. మూడురోజుల వ్యవధిలో తమిళనాడు రాజకీయం మొత్తంగా మారిపోవటం.. మొన్నటి వరకూ మనసులో ఎన్ని ఉన్నా.. పైకి మాత్రం కలిసి ఉన్న శశికళ.. పన్నీర్ లు ఇప్పుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం తెలిసిందే. అయితే.. ఇక్కడో ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం వరకూ పన్నీర్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య యాభైకి పైనే అన్న ప్రచారం జోరుగా సాగింది. మొన్నటికి 35 మంది అన్న వార్తలు.. నిన్న (మంగళవారం) రాత్రికి యాభైకి చేరుకున్నట్లుగా చెప్పారు.
అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం చిన్నమ్మ నిర్వహించిన పార్టీ మీటింగ్ కు 130 మంది ఎమ్మెల్యేలు వెళ్లటంతో పన్నీర్ బలం జీరోగా తేలిపోయింది. పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు వెంట లేకున్నా.. పన్నీర్ ఏ ధైర్యంతో చిన్నమ్మ మీద యుద్ధం ప్రకటించారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. తమిళనాడు రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం.. చివరి క్షణం వరకూ పన్నీరు వర్గంలో ఉన్నట్లుగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని.. సమయం వచ్చినప్పుడు తామేంటో చూపించాలన్న ఆలోచనలో పన్నీర్ వర్గం ఉందని చెబుతున్నారు.
అయితే.. ఈ వాదనను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదేమీ సినిమా కాదని.. రియల్ రాజకీయాల్లో ఇలాంటి ట్విస్ట్ లు ఉండవన్న మాట వినిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు చిన్నమ్మే టికెట్లు ఇవ్వటంతో ఆమె మాట కాదనలేక ఈ రోజు సమావేశానికి వెళ్లి ఉంటారన్న మాట వినిపిస్తోంది.పార్టీ ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. అక్కడికక్కడే క్యాంప్ రాజకీయాల్ని సిద్ధం చేసేసి.. ఎమ్మెల్యేల్ని బస్సుల్లోఎక్కించిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ముందస్తుగా క్యాంప్ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడిన చిన్నమ్మ.. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలందరిని రహస్య ప్రాంతాలకు తరలించారన్న వాదన వినిపిస్తోంది. పన్నీర్ పక్షాన ఉన్న పలువురు ఎమ్మెల్యేలు.. చిన్నమ్మ నిర్వహించిన సమావేశానికి వెళ్లారని.. కానీ అక్కడ అనుకోని రీతిలో చిన్నమ్మ ప్లాన్ వర్క్ వుట్ చేయటంతో పన్నీరు వర్గమంతా ఇప్పుడు చిన్నమ్మ చేతుల్లోకివెళ్లిపోయిందన్న మాట వినిపిస్తోంది. చేతిలో ఎమ్మెల్యేలు లేకున్నా.. సోషల్ మీడియా.. సెలబ్రిటీ వర్గాలు.. ప్రజల్లోనూ పన్నీర్ పట్ల ఆదరణ ఉండటం గమనార్హం. మరి.. జీరో స్కోర్ లో ఉన్న పన్నీర్.. 130 మంది ఎమ్మెల్యేలున్న చిన్నమ్మతో ఎలా తలపడతారు? అధికారాన్నిచేజిక్కించుకుంటారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/