ఏమవుతుంది?: అమ్మ 130+.. పన్నీర్ ఓన్లీ 3

Update: 2017-02-09 04:09 GMT
ఇరువురు నేతలు పోటాపోటీగా.. పోట్ల గిత్తల్లా.. విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్న వేళ.. ఇద్దరి తరఫున నేతల బలం కాస్త అటూ ఇటూగా ఉండటం మామూలే.కానీ.. తమిళనాడు రాష్ట్ర అపధర్మ ముఖ్యమత్రి పన్నీరు సెల్వం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం వరకూ సీఎంగా వ్యవహరించిన ఆయన.. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల తాను తన పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించటం.. ఆ నిర్ణయాన్ని గవర్నర్ ఓకే చేసేయటంతో పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.

పన్నీర్ రాజీనామా అనంతరం.. ఆయన్ను అపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించమని పగ్గాలు అందించినప్పడు కూడా మామూలుగా ఉన్న ఆయన మంగళవారం రాత్రి ఒక్కసారిగా బరస్ట్ కావటం తమిళ రాజకీయాల్లో భారీ కుదుపునకు గురైందని చెప్పాలి. బుధవారం ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పన్నీర్ కు 35 మంది ఎమ్మెల్యేల అండ ఉందన్న ప్రచారం జరిగింది. మంగళవారం రాత్రి చిన్నమ్మపై చెలరేగిపోయి మరీ విమర్శలు.. ఆరోపణలు చేసిన పన్నీర్ దెబ్బకు ఆయన ఇమేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఇదే సందర్బంలో పన్నీరు పంచకు 50 మందికి పైనే నేతలు చేరారని.. మరికొంత మంది క్యూలో ఉన్నారన్న మాట వినిపించింది.

పొద్దుపొద్దునే శశిలత మీద తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన.. అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వేళ.. తనను కనీసం చూసేందుకు కూడా అనుమతించలేదని.. 75 రోజులు అమ్మ ఆసుపత్రిలో ఉంటే రోజుకు మూడు సార్లు వెళ్లినా లోపలకో వెళ్లకూడదని చెప్పినట్లుగా వెల్లడించారు. అపోలో ఆసుపత్రిలో చిన్నమ్మదే హవా అన్న విషయాన్ని చెప్పేసిన పన్నీరు.. భావోద్వేగ రాజకీయాల్లో శశికళను ఎలా దెబ్బేయొచ్చో తెలిసేలా మరీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పన్నీర్ వెనుక అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఇంత మంది ఎమ్మెల్యేల ఊహాగానాలకు చెక్ పెట్టేలా ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నట్లుగా తేలిపోయింది.

మరోవైపు.. పన్నీర్ ను దెబ్బ తీయటమే లక్ష్యంగా చిన్నమ్మ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయటమే కాదు.. తనకున్న బలాన్ని తెలిసేలా చేశారు. పార్టీకి ఉన్నఎమ్మెల్యేలు అంతా తన వెంటనే ఉన్నారన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసిన ఆమె.. అనూహ్యంగా బస్సు జర్నీని తెర మీదకు తీసుకొచ్చి పన్నీరుకు షాకిచ్చారు.

ఇద్దరు.. ముగ్గురు తప్పించి పార్టీ ఎమ్మెల్యేలంతా తన వైపే ఉన్నారన్న మెజార్టీ అంకెను ప్రదర్శించటం ద్వారా పవర్ గేమ్ లో తిరుగులేని నెంబర్ తనదేనని స్పష్టం చేశారు. మరీ.. నెంబర్లు తుది నిర్ణయం మీద ప్రభావితం చేస్తాయా? విశేష అధికారాలున్న గవర్నర్.. తన విచక్షణతో నెంబర్లకు అతీతంగా నిర్ణయం తీసుకుంటే..? అన్నదే చిన్నమ్మ భయంగా చెబుతున్నారు. ఏం జరుగుతుందన్నది కాలానికి మించి కచ్ఛితంగా మరెవరూ చెప్పలేరని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News