చిన్నమ్మ మీద ధిక్కార స్వరాన్ని వినిపించటమే కాదు.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా చెబుతున్న పన్నీర్ సెల్వం.. తాజాగా పార్టీ మీద పట్టు పెంచుకునే దిశగా ప్రయత్నాలు షురూ చేయటం ఆసక్తికరంగా మారింది. చిన్నమ్మపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసిన వెంటనే పన్నీర్ పై ఆమె వేటు వేయటం తెలిసిందే. అయితే.. తనను పార్టీ కోశాధికారి పదవిలో నియమించిన అమ్మ నియమకాన్ని ఎవరూ తీసేయలేరన్న వాదనను వినిపించిన పన్నీర్.. లీగల్ గా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్నారు.
తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే పార్టీ ఖాతాను వినియోగించొద్దంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. పార్టీ నిబంధన ప్రకారం రూల్ నెం.20 సబ్ క్లాజ్ 5 ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక పూర్తి అయ్యే వరకూ ఖాతా తన అధీనంలో ఉంచుకునే హక్కు ఉందని పన్నీర్ తేల్చి చెప్పారు. తాను చెప్పే వరకూ బ్యాంకు ఖాతాలను వాడరాదని ఆయన లేఖలో కోరారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత నిబంధన 20.. సబ్ క్లాజ్ 2 ప్రకారం ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరగలేదని.. అందువల్ల ఖాతా అధికారాలు తనకే ఉన్నాయని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. అప్పుడెప్పుడో అమ్మకు చిన్నమ్మ రాసిన లేఖను విడుదల చేయటం ద్వారా మంట పుట్టేలా చేసిన పన్నీర్.. తాజాగా మరో లేఖతో పార్టీ బ్యాంకు ఖాతాల మీద తన పట్టు సడలకుండా చూసుకోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/