ప్రధాని మోడీకి ఎన్నికల ముందున్న ఊపు ఇప్పుడు బాగా తగ్గిందన్న ప్రచారం ఒకటి పెద్ద ఎత్తున జరుగుతోంది.... అయితే గణాంకాలు మాత్రం దాన్ని కాదంటున్నాయి. ప్రపంచ నేతల్లో ఆయనకు రెండో స్థానం ఉందని చెబుతున్నాయి. ఒబామా తరువాత ఆ స్థాయి ఉన్న నేత మోడీ మాత్రమేనంటున్నాయి. ఇటీవలే అమెరికాకు చెందిన ఓ సంస్థ మోడీకి ఇండియాలో ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని సర్వే చేసి చెప్పగా తాజాగా ట్విట్టర్ విడుదల చేసిన గణాంకాలైతే మోడీ ఇమేజి మరింత పెరిగినట్లు రుజువు చేశాయి. ట్విట్టర్ లో ఉన్న ప్రపంచ నేతల్లో రెండో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా మోడీ నిలిచారు. కోటీ 50 లక్షలమంది ఫాలోవర్లతో మోడీ రెండో ప్లేసులో ఉన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఇంకా చాలా ముందున్నారు. ఆయన్ను ట్విట్టర్ లో అనుసరిస్తున్నవారి సంఖ్య ఏకంగా 6 కోట్ల 43 లక్షలు.
అయితే... ఇదంతా నేతల ఫాలోవర్ల లెక్క. దాని ప్రకారం మోడీ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. కానీ, సెలబ్రిటీలందరినీ పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలో ఆయన స్థానం 3. ఆయన కంటే ముందున్న నాయకుడెవరూ లేనప్పటికీ బాలీవుడ్ కింగ్ లు అమితాబ్ కోటీ 70 లక్షలు... షారూక్ కోటీ 53 లక్షల మంది ఫాలోవర్లతో మోడీ కంటే ముందున్నారు. అయితే... ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే మోడీకి పెరుగుతున్న అభిమానుల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే కొద్దిరోజుల్లో ఆయన అమితాబ్, షారూక్ లను దాటేయడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే గత ఏడాది కాలంలో మోడీ అభిమానుల సంఖ్య 88 లక్షలు పెరిగింది. ఒక్క ఏడాదిలో ఇంతమంది కొత్త ఫాలోవర్లను సంపాదించుకున్నవారు భారతదేశంలో ఇంకెవరూ లేరని ట్విట్టర్ వెల్లడించింది.
మోడీకి ట్విట్టర్ లో మరో ప్రపంచ రికార్డు ఉంది. ఆయన చేసిన ట్వీట్లకు వచ్చినన్ని రీట్వీట్లు ప్రపంచంలో ఇంకెవరికీ రావడం లేదట. ఆ విషయంలో మోడీ ప్రపంచంలోనే టాప్.