వికీలీక్సులో లోకేశ్

Update: 2016-07-24 05:55 GMT
టీడీపీ యువనేత నారా లోకేష్ పేరు వికీలీక్సులో కనిపించడం ఇప్పడు సంచలనంగా మారింది. గతంలో లోకేశ్  అమెరికా వెళ్లినప్పుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. ఆ భేటీ తరువాత డెమొక్రటిక్ పార్టీ అంతర్గత మెయిల్స్ లో దానిపై చర్చ జరిగింది. అసలు ఈ నారా లోకేష్ ఎవరంటూ అక్కడి నేతలు చర్చించుకున్నారు.  ఒబామా  నారా లోకేష్ భేటీ వెనుక ఏదో దురుద్దేశం ఉందంటూ ఆ సందేహాలు వ్యక్తంచేస్తూ పార్టీ నేతల మధ్య  మెయిల్స్ ను బట్టి అర్ధమౌతోంది. దేశాధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేసే 20,000 ఈ మెయిల్స్ ను నిన్న వికీ లీక్స్ బయట పెట్టింది.
    
2015 జనవరి 2016 మే మధ్య డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్ సీ) కి చెందిన 20వేల మెయిల్స్ బయటపడటంతో హిల్లరీకి  అనుకూలంగా సాగిన పెద్ద కుట్ర బయటపడిందంటున్నారు.  అమెకు పార్టీలో ప్రత్యర్థి అయిన శాండర్స్ ను కాదని  పార్టీ అభ్యర్ధిగా హిల్లరీ పేరు ఖరారు అయ్యేలా డీఎన్ సీ లో కుట్ర జరిగిందని, ఓట్ల రిగ్గింగ్ జరిగిందని ఈ మెయిల్స్ లో బయటపడింది.  ఈ ఈమెయిళ్లతో పాటు  నారా లోకేష్ కు సంబంధించి డీఎన్ సీ అధికారుల మద్య జరిగిన ఈ మెయిల్స్ కూడా బయటపడ్డాయి.  నారా లోకేష్ మే 7 న ఒబామాను కలిస్తే .. ఈ భేటీపై మే 14వ తేదీన డీఎన్ సీ అధికారులు  చర్చించుకున్నారు.

హూ ఈజ్ లోకేశ్..?

వికీలీక్సు బయటపెట్టిన ఈమెయిళ్ల ఆధారంగా చూసుకుంటే... ఒబామా ప్రత్యేక కార్యదర్శి బాబీ షూమెక్ తొలిసారిగా లోకేష్ గురించి అనుమానం  వ్యక్తం చేశారు. పోర్టుల్యాండ్  ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఒబామాతో ఫోటో దిగిన నారా లోకేష్ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. నారా లోకేష్ అనే వ్యక్తి ఒబామాతో ఫోటోకు దిగారు. ఆయన పౌరసత్వం ఏదంటూ బాబీ తన అధికారిక మెయిల్ ఐడీ నుంచే పంపిన మెయిల్ లో ప్రశ్నించారు. ఫండ్  రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు స్టోవ్ - ఎరిక్ - కప్లాన్ - జోర్దాన్ - అలాన్ రీడ్ లకు ఈ మెయిల్ పంపించారు. ఇది 2015 మే 14వ తేదీన జరిగింది. బాబీ మెయిల్ వచ్చిన 11 నిమిషాలకు డీఎన్ సీ నుంచి అలాన్ రీడ్ బదులిచ్చారు. అమెరికా ప్రజల సమాచారాన్ని అందించి లెక్సిన్ లో నారా లోకేష్ కు సంబంధించి ఒక హిట్ ఉందని, అయితే ఆయన అమెరికా ఓటర్ల జాబితాలో లేరని సమాధానం వచ్చింది. ఈలోగా బాబీ వెంటనే వీకిపీడియాలో నారా లోకేష్ కు సంబంధించిన సమాచారం లింకు పంపిస్తూ.. మీరెవరూ నారా లోకేష్ ను కలవలేదా అంటూ  ప్రశ్నించారు.  ఇలా వారి మధ్య లోకేశ్ కేంద్రంగా చాలా మెయిల్సు నడిచాయి.  ఈ ఈమెయిళ్లన్నీ వికీలీక్సులో వెల్లడించారు. లోకేశ్ ఎవరన్నది అర్థం కాక అమెరికా చట్టసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తంచేశారు.
Tags:    

Similar News