ఏమైనా ఒబామా మొన‌గాడండి

Update: 2016-05-18 14:52 GMT
కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌టం అంత సులువైన విష‌యం కాదు. ఇక‌.. ప‌ద‌వీకాలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యాల్ని పెండింగ్ పెట్టేయ‌టం.. ఒక‌వేళ త‌ప్ప‌క నిర్ణ‌యాలు తీసుకుంటే స‌ర్వామోదం క‌లిగేలా చూసుకోవ‌టం మామూలే. ఏ మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండే నేత అయినా ఇలాంటి వైనాన్నే అనుస‌రిస్తారు. అంతేకానీ త‌న నిర్ణ‌యంలో అన‌వ‌స‌ర సంచ‌నాల‌కు తెర తీయాల‌ని అస్స‌లు అనుకోరు. తాజాగా అమెరికా అధ్య‌క్షులు బ‌రాక్ ఒబామా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

వ‌చ్చే ఏడాది మొద‌ట్లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఆయ‌న తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఓ స్వ‌లింగ సంప‌ర్కుడ్ని ఆర్మీ సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలు పూర్తి అయ్యాయి. గ‌త కొద్దికాలంగా ఈ ప‌ద‌వికి స‌రిపోయే వ్య‌క్తిని ఎంపిక చేసే విష‌యంలో వెయిట్ చేస్తున్న ఒబామా తాజాగా ఎరిక్ ఫానింగ్ అనే గేను నియ‌మించ‌టం ద్వారా.. తాను స్వ‌లింగ సంప‌ర్కుల‌కు ఏమాత్రం వ్య‌తిరేకిని కాద‌న్న విష‌యాన్ని తేల్చేశార‌ని చెప్పాలి.

ఒబామా తీసుకున్న నిర్ణ‌యంతో అమెరికా సైనిక విభాగానికి సంబంధించి తొలి గే వ్య‌క్తిని నియ‌మించిన రికార్డు ఒబామా పేరిట న‌మోదు కానుంది. గ‌తంలో స్వ‌లింగ సంపర్కుల‌కు అత్యున్న స్థానాల్లో నియ‌మించ‌టానికి అమెరికా ఏ మాత్రం ఇష్ట‌ప‌డేది కాదు. అందుకు భిన్నంగా తాజా ఎంపిక ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 
Tags:    

Similar News