అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మనదేశానికి వచ్చినప్పటికీ హడావుడిని గుర్తుచేసుకోండి. అబ్బో...దేశమంతా ఆయన గురించే చర్చ జరిగింది. మన ప్రధానమంత్రి అయితే ఒబామాతో కూడా చాయ్ పే చర్చను నడిపించారు. మనదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ సహా కీలకమైన ప్రజాప్రతినిధులందరితో మాట్లాడించారు. పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. అయితే తాజాగా అమెరికా పర్యటనలో మోడీకి ఝలక్ ఎదురైంది. అది కూడా ఒబామా నుంచే కావడం ఆసక్తికరం.
నరేంద్ర మోడీ ఎవరు? అదేం ప్రశ్న అంటారా? ఆయన మనదేశ ప్రధాని కదా! కాదు. మోడీ రాష్ట్రపతి అయ్యారు. అదేంటి? అలా ఎప్పుడు అయ్యారు? అని అనుకుంటున్నారా! కానీ ఒబామా మోడీని రాష్ట్రపతి చేశారు. భద్రత - ఆర్థిక సహకారం - వాతావరణ మార్పులపై జరిగిన చర్చ సందర్భంగా ఒబామా నోరు జారిపోయింది. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి బదులు రాష్ట్రపతి మోడీ అని ఉచ్ఛరించారు. శుద్ధ ఇంధనంపై రాష్ట్రపతి మోడీ చిత్తశుద్ధి తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు ఒబామా. అయితే విషయం తెలుసుకున్న వైట్ హౌస్ రాష్ట్రపతి ఉన్న చోట ప్రధాన మంత్రి అని సవరణ చేసింది. అనంతరం కొత్త ప్రకటనను ప్రధానమంత్రి పేరుతో వివరించారు. మోడీ హోదాను ప్రధానమంత్రి గా కాకుండా రాష్ర్టపతిగా ఉచ్చరించడం అంటే...ఒబామా పట్టించుకోనట్లా లేక అచ్చుతప్పుల్లో భాగమా? అనేది ఆలోచించాల్సిందే.