అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతీయ పండుగ దివాలీని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరై భారతీయ సంప్రదాయ రీతిలో ఈ పండుగను నిర్వహించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలుత దీపారాధన చేసిన ఒబామా తర్వాత వరుసగా పేర్చిన దీపాలను కూడా వెలిగించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లోని ఇండియన్ అమెరికన్స్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా భారత్ సహా ప్రపంచంలో ఈ పండుగను జరుపుకొనే వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
వైట్ హౌస్ దివాలీ విశేషాలను వైట్ హౌస్ అధికారులు అధికారిక ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. అర్థరాత్రి ఒబామా చేసిన ఈ పోస్టుకు 1.5 లక్షల లైక్ రాగా.. 33 వేల మందికి పైగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఒబామా తన గతంలోకి వెళ్లిపోయారు. గతంలో తాను సరిగ్గా దీపావళి పండుగ రోజు ఇండియాలోని ముంబైలో ఉన్నట్టు చెప్పారు. ఆ సందర్భంగా తనను, తన సతీమణిని ఎంతో ఘనంగా స్వాగతించారని గుర్తు చేసుకున్నారు. చీకటిని వెలుగు ఎలా అధిగమిస్తుందో తెలిపే సంకేతంగా ఈ దీపం నిలుస్తుందన్నారు. ఈ పండుగ తన ఫ్యామిలీలో ఎంతో ఆనందాన్ని నింపిందని చెప్పారు.
తన తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టే వారు కూడా దివాలీని నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ దివాళి వేడుకలు తమ ప్రియమైన వారందరికీ శాంతి సౌభాగ్యాలతో ఆనందం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వైట్‌హౌస్ బుక్‌లో ఒబామా తన అభిప్రాయం రాశారు. అయితే, అగ్రరాజ్యం అధ్యక్ష భవనంలో దివాలీ వేడుకలు జరగడం ఒబామా హయాంలోనే ప్రారంభం అయ్యాయి. వైట్‌హౌస్‌లోని ఇండియన్ ఉద్యోగుల కోరిక మేరకు 2009లో ఆయన తొలిసారి దీపం వెలిగించి ఈ పండుగను ప్రారంభించారు. సో వచ్చే దివాలీ కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో వైట్ హౌస్‌లో జరగనుంది. ఒబామాకు అధ్యక్షుడిగా ఇదే చివరి దివాలీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/