అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా మంగళవారం తన చివరి ప్రసంగాన్ని చేయనున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఎక్కడైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారో అదే షికాగోలో తన మద్దతుదారులను ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో ఒబామా చివరి జర్నీ కూడా ఇదే. ఒబామా అభిమానులు - చాలావరకు ఆఫ్రికన్ అమెరికన్స్ ఈ సభకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. మొదట్లో ఫ్రీగా ఇచ్చిన ఈ టికెట్లను ఇప్పుడు వెయ్యి డాలర్ల వరకూ అమ్ముతుండటం విశేషం. ఒబామాతో పాటు ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా - వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ - ఆయన భార్య జిల్ బైడెన్ కూడా షికాగో వెళ్లనున్నారు.
దేశ భవిష్యత్తుపై తన విజన్ ను ఈ ప్రసంగంలో ఒబామా ఆవిష్కరించనున్నారని ఆయన లీడ్ స్పీచ్ రైటర్ కోడీ కీనన్ వెల్లడించారు. ఇది ట్రంప్ వ్యతిరేక ప్రసంగంలా సాగదు. నిజమైన రాజనీతిజ్ఞుడిలా ఒబామా మాట్లాడతారు అని కీనన్ తెలిపారు. జార్జ్ వాషింగ్టన్ నుంచి అమెరికా అధ్యక్షులు వీడ్కోలు ప్రసంగాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వాషింగ్టన్ చివరి 7641 పదాల ప్రసంగాన్ని ఇప్పటికే ప్రతి ఏడాది సెనేట్ లో చదివి వినిపిస్తుంటారు. ఇక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కొన్నాళ్ల హాలిడే - ఆటోబయోగ్రఫీపై ఒబామా దృష్టిసారించనున్నారు. అయితే ట్రంప్ ముస్లిం రిజిస్ట్రీ - వలసవాదులను దేశం నుంచి వెలివేయడంలాంటి చర్యలకు పాల్పడితే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కూడా ఒబామా భావిస్తున్నారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/