ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే వాటి అంతు చూసే సీన్లున్న సినిమాలు చాలానే చూసి ఉంటారు. మరీ.. అంతటి దారుణ పరిస్థితి కాకున్నా.. వారి నీడను వీరు.. వీరి నీడను వారు భరించలేని రెండు దేశాలుగా అమెరికా.. క్యూబాలను చెప్పుకోవచ్చు. ఈ రెండు దేశాల్ని మ్యాప్ లో చూసినప్పుడు పక్కపక్కనే ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ.. ఈ రెండు దేశాల మధ్య అంతరం అంతాఇంతా కాదు. మరింత అంతరం ఈ రెండు దేశాల మధ్య ఎందుకంటే.. క్యూబాలో విప్లవం తర్వాత అమెరికా ఆంక్షలు పెట్టటం.. పెద్దన్న పెత్తందారీ విధానాన్ని క్యూబా నిర్మోహమాటంగా తిరస్కరించటంతో ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరిగిపోయింది.
చివరకు.. ఉప్పు నిప్పులా మారిన పరిస్థితి. దీంతో.. గడిచిన 88 ఏళ్లుగా ఒక అమెరికా అధ్యక్షుడు.. క్యూబాలో అడుగుపెట్టింది లేదు. ప్రపంచానికి పెద్దన్న అయినా.. అమెరికాను లైట్ తీసుకునే దేశాల్లో క్యూబా ఒకటిగా ప్రసిద్ధి. అలాంటి దేశంలో అమెరికాకు దాదాపు ఏళ్లకు ఏళ్లు ద్వైపాక్షిక సంబంధాలు కూడా లేని దుస్థితి.
అయితే.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఒబామా తీసుకున్న చొరవతో గత ఏడాది రెండు దేశాలు పరస్పరం రాయబార కార్యాలయాల్ని తిరిగి ప్రారంభించటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ షురూ అయ్యాయి. 88 ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు అడుగుపెట్టని క్యూబాలో తాజాగా ఒబామా అడుగుపెట్టారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఒబామా హవానాలో అడుగు పెట్టారు.
ఉప్పు నిప్పు లాంటి దేశాల మధ్య సంబంధాలు కొత్త అధ్యాయం మొదలుకానున్న నేపథ్యంలో కావొచ్చు.. ఒబామా క్యూబాలో అడుగు పెట్టిన తర్వాత వర్షం మొదలైంది. అంత వర్షంలోనూ తొలుత హవానా రాయబార కార్యాలయంలోకి అడుగు పెట్టారు. పర్యటన చారిత్రాత్మకం అని వ్యాఖ్యానించారు. ఒబామా తాజా పర్యటనలో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.