నాడు టీ అమ్మిన వ్యక్తి..నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత : ఒబామా

Update: 2020-11-14 02:30 GMT
భారత ప్రధాని మోడీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు జల్లు కురిపించాడు. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో ఒబామా ఓ పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. కాగా, 2015లో టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ గురించి పేర్కొన్న అంశాలను కూడా ఒబామా ఈ పుస్తకంలో రచించారు. ఒకప్పుడు తండ్రికి సాయం చేసేందుకు, కుటుంబానికి అండగా ఉండేందుకు టీ అమ్మిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు అని మోడీపై ఒబామా పొగడ్తలు కురిపించాడు.

భారత చైతన్యశీలతకు, సమర్థతకు పేదరికం నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ జీవితమే నిదర్శనమని ,పేదరిక నిర్మూలన, మెరుగైన విద్య, బాలికలు-మహిళల సాధికారత వంటివాటిపై మోడీకి స్పష్టమైన లక్ష్యాలున్నాయని ఒబామా ప్రశంసించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొంటూనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు పాడుపడుతున్నారని అన్నారు. యోగాకు నరేంద్ర మోడీ భక్తుడని ఒబామా చెప్పుకొచ్చారు. డిజిటల్ ఇండియా కలలను నిజం చేస్తున్నారని తెలిపారు.

మోడీ అమెరికా పర్యటన సమయంలో తనతో కలిసి డాక్టర్ మార్టిన్ కింగ్ జూనియర్ స్మారకాన్ని సందర్శించుకున్న సందర్బాన్ని కూడా ఒబామా తన పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. కోట్లాది మంది భారతీయుల సమైక్యత ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని మోడీ గుర్తించారని ఒబామా వెల్లడించారు. నవంబర్ 17న మార్కెట్లోకి రానుంది. ఇందులోని కొన్ని కథనాల్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఆ పుస్తకం లో రాహుల్ గాంధీ ,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
Tags:    

Similar News