ట్రంప్ పై తిరుగుబాటు చేయ‌మంటున్న ఒబామా

Update: 2017-01-31 11:27 GMT
అమెరికా అధ్యక్షుడిగా శ్వేత‌సౌధం వ‌దిలిన త‌ర్వాత చేసిన తొలి ప్ర‌క‌ట‌న‌తో మాజీ అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌స్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై ఒబామాపై మండిప‌డ్డారు. అధ్య‌క్షుడు ట్రంప్ అమెరికా విలువ‌లకు ముప్పు వాటిల్లే చ‌ర్య‌ల‌ను అడ్డుకోవాల‌ని, ట్రంప్ నిర్ణ‌యాల‌పై నిర‌స‌న‌లు తెల‌పండ‌ని  బ‌రాక్ ఒబామా పిలుపునిచ్చారు. మ‌తం - న‌మ్మ‌కాల ఆధారంగా ఒక వ్య‌క్తిపై వివ‌క్ష చూప‌కూడ‌ద‌న్న ప్రాథ‌మిక ధ‌ర్మాన్ని ట్రంప్ విస్మ‌రిస్తున్నార‌ని ఒబామా విమ‌ర్శించారు. ఒబామా త‌ర‌ఫున ఆయ‌న అధికార ప్ర‌తినిధి కెవిన్ లూయిస్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

వైట్‌ హౌజ్ వ‌దిలిన త‌ర్వాత ఒబామా తొలి ప్ర‌క‌ట‌నలో ట్రంప్ చ‌ర్య‌ల‌పై తొలిసారి ఒబామా నోరు విప్పారు. అయితే అధ్య‌క్షుడిపై మాజీ అధ్య‌క్షులు విమ‌ర్శ‌లు చేయ‌డం అమెరికా సాంప్ర‌దాయాల‌కు విరుద్ధం. ట్రంప్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై తాను అనుకున్న‌ట్లే ప్ర‌జ‌లు నిర‌స‌న తెలుపుతున్నార‌ని ఒబామా ఈ ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల  మేర‌కు ఒబామా గ‌ళం విప్పార‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు ఈ ప‌రిణామంపై ట్రంప్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాలు 40 ఉన్నాయని.. తాజా ఉత్తర్వుల వల్ల ముస్లింలపై పెద్దగా ప్రభావం ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను మీడియా వక్రీకరిస్తున్నదని ట్వీట్ చేశారు. ఒబామా ప్రభుత్వం కూడా 2011లో ఇరాక్ శరణార్థులను దేశంలోకి రాకుండా 6నెలలపాటు నిషేధం విధించిందని గుర్తు చేశారు.

ఇదిలాఉండ‌గా...ట్రంప్ ఆదేశాలు వియానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిషేధిత దేశాలకు చెందిన పైలట్లు, విమానసిబ్బందిని అమెరికాలోకి అనుమతించకపోవడంతో.. ఇతర దేశాల పాస్‌పోర్టు ఉన్న సిబ్బందికి విధులు కేటాయించాల్సి వస్తోంది. దీంతో తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. కాగా, నిషేధిత ఏడు దేశాలకు చెందిన 15మంది ప్రయాణికులను అమెరికా తీసుకెళ్లేందుకు ఎయిర్ ఫ్రాన్స్ నిరాకరించింది. అమెరికా పౌరసత్వ గుర్తింపు అయిన గ్రీన్‌కార్డు ఉన్నా.. నిషేధిత దేశాలకు చెందిన ప్రజలను విమానాశ్రయాల్లో అధికారులు నిర్బంధిస్తున్నారు. ఆయా వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించి.. సంతృప్తి చెందాకే వదిలిపెడుతున్నారు. ట్రంప్ తమ దేశంలో పర్యటించడానికి వీలులేదని పేర్కొంటూ వేలమంది బ్రిటన్ పౌరులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News