బుర‌ద అంటుతుంద‌ని..ఎమ్మెల్యేను మోసుకెళ్లారు

Update: 2017-07-13 09:33 GMT
ఆయ‌నో ఎమ్మెల్యే. ఓ కార్య‌క్ర‌మానికి వెళ్లాడు. మ‌ధ్య‌లో ఓ చిన్న బుర‌ద కాలువ దాటాలి. అక్క‌డే ఆయ‌న ఆగిపోయారు. తెల్ల దుస్తులు వేసుకున్న ఆ ఎమ్మెల్యే ఆ బుర‌ద కాలువ ఎలా దాటాల‌ని ఆలోచిస్తున్నాడు. ఇంత‌లో మ‌ద్ద‌తుదారులు ఆయ‌న‌కు హెల్ప్ చేశారు. ఎమ్మెల్యే షూ త‌డ‌వ‌కుండా ఉండేందుకు ఆయ‌న్ను భుజాల‌పై మోసుకుని వెళ్లారు. ఈ ఘ‌ట‌న వివాదానికి దారి తీసింది.

ఆ ఎమ్మెల్యే పేరు మాన‌స్ మ‌ద్‌ క‌మి. ఆయ‌న‌ది బీజూ జ‌న‌తా ద‌ళ్ పార్టీ. ఎమ్మెల్యేను భుజాల‌పై ఎత్తుకెళ్లిన సంఘ‌ట‌న వీడియోకు చిక్కింది. ఇదే కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఎంపీ బ‌ల‌భ‌ద్ర మాజీ మాత్రం ఆ బుర‌ద కాలువ నుంచే న‌డుచుకుంటూ వెళ్లాడు. ఎమ్మెల్యేగారు మాత్రం అలా చేయ‌కుండా ప్ర‌త్యేక‌ మ‌ర్యాద‌లు పొందారు. ఈ సంఘ‌ట‌న వివాదంగా మారింది. అయితే ఎమ్మెల్యే మాత్రం త‌న‌ను మోసుకెళ్ల‌డాన్ని స‌మ‌ర్థించుకున్నాడు. అది త‌న మ‌ద్ద‌తుదారుల ప్రేమ‌, అభిమానం అని చెప్పారు. అన‌వ‌స‌రంగా వివాదం చేస్తున్నార‌ని క‌స్సుబుస్సులాడారు.
Tags:    

Similar News