ప్రజా ప్రతినిధులు ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు కూడా బాగా కక్కుర్తి పడతారు. వందల, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా గజం స్ధలం ఆక్రమించుకోవటానికి ఏ మాత్రం వెనకాడరు. ఇప్పుడిదంతా ఎందుకంటే బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ గురించే. జూబ్లీహిల్స్ నెంబర్ 66 రోడ్డులో సీఎం రమేష్ కట్టుకుంటున్న ఇంటి గోడను అధికారులు కూల్చేశారు. దాంతో ఇదో పెద్ద వివాదమైంది.
ఇంతకీ విషయం ఏమిటంటే రమేష్ కట్టుకుంటున్న ఇంటికి ముందు ఫుట్ పాత్ ఉంది. ఫుట్ పాత్ అంటేనే జనాలు నడవటానికి అని అందరికీ తెలిసిందే. తనింటి ముందు ఫుట్ పాత్ లో జనాలు నడవటం ఏమిటని అనుకున్నారో ఏమో వెంటనే దాన్ని ఆక్రమించేసుకున్నారు. తనింటి స్ధలంలో నిర్మాణంలో ఫుట్ పాత్ ను కలిపేసుకుని గోడ కట్టేసుకున్నారు. ఇదే విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు ఫుట్ పాత్ ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ రమేష్ కు నోటీసిచ్చారు. వెంటనే గోడను తొలగించాలని నోటీసులో స్పష్టంగా చెప్పారు. అయినా రమేష్ నోటీసును లెక్కచేయలేదు. దాంతో లాభం లేదని అధికారులే ఇంటి దగ్గరకు చేరుకుని గోడను కూల్చటం మొదలుపెట్టారు. దాంతో వెంటనే ఎంపీ వ్యక్తిగత సిబ్బంది అధికారులను అడ్డుకున్నారు.
నిర్మాణంలో ఉన్న గోడను కూల్చేందుకు లేదని అభ్యంతరం చెప్పారు. దాంతో అధికారులు నిబంధనలు గుర్తుచేసి ఆక్రమించిన పుట్ పాత్ ను చూపించారు. దాంతో వ్యక్తిగత సిబ్బంది కాస్త వెనక్కి తగ్గారు. దాంతో గోడను కూల్చివేత మొదలుపెట్టారు. అయితే వెంటనే వ్యక్తిగత సిబ్బంది మళ్ళీ అడ్డుపడి ఆక్రమించిన గోడను తామే కూలగొట్టేస్తామని చెప్పారు. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాదన జరిగిన తర్వాత గోడను కూల్చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పి అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఫుట్ పాత్ ను ఆక్రమించుకోవటం తప్పని ఎంపీకి బాగా తెలుసు. అయినా ఆక్రమించేసుకుని గోడ కట్టేసుకున్నారు. మరలాంటపుడు తామే గోడను కూల్చేస్తామని ఎంపీ వ్యక్తిగత సిబ్బంది చెబితే ఉన్నతాధికారులు ఎలా నమ్మారు ? గోడను కూల్చేసే ఉద్దేశ్యమే నిజమైతే అసలు ఆక్రమణ ప్రసక్తే ఉండదుకదా. కోట్లరూపాయలతో ఇల్లు కట్టుకుంటు 10 అడగుల ప్రభుత్వ స్ధలాన్ని అదికూడా జనాలు నడిచే ఫుట్ పాత్ ను ఆక్రమించుకోవాలన్న ఎంపీ కక్కుర్తి చాలా ఆశ్చర్యంగా ఉంది.