ఏపీ సీఎం జగన్ గద్దెనెక్కగానే అప్పుల్లో ఉన్న రాష్ట్రమనీ.. చంద్రబాబు ముంచేశాడని.. పొదుపు పాటించాలంటూ పిలుపునిచ్చాడు. అవినీతిని అరికడితానన్నాడు. కొత్త ఊపులో అలా అంటున్నాడని అందరూ అనుకున్నారు.. ఏపీ అధికారులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో కలెక్టర్లు- ఎస్పీల మీటింగ్ తర్వాత జగన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడం లేదట.. నిజంగా నిజమిదీ.. జగన్ మరీ ఇంత చేతల్లో చూపుతాడా అని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే షాక్ అవ్వడం వారి వంతైందట..
ఉమ్మడి ఏపీలోకానీ.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అందరు సీఎంలదీ ఒకటే బాట.. నాడు వైఎస్ హయాంలోనూ ఏదైనా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటిలు ఉంటే మధ్యాహ్నం పూట లంచ్ లో పంచభక్ష పరమన్నాలు వడ్డించేవారు. హైదరాబాద్ బిర్యానీ- ఫిష్ లు- చికెన్- మటన్- వెజ్- నాన్ వెజ్ రుచులతోపాటు స్వీట్లు కూడా అధికారుల కోసం చేయించి పెట్టేవారు. మీటింగ్ లంటే కడుపునిండా తినడానికేనన్నట్టు పరిస్థితి ఉండేది. అధికారులు ఫుల్ ఖుషీ అయ్యేవారు.
ఇక విడిపోయాక కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షలైనా.. పార్టీ సమావేశాలైనా మధ్యాహ్నం పూట భారీ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అధికారులను మచ్చిక చేసుకోవడంలో కేసీఆర్ పెట్టే తిండే వేరబ్బా అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు విడిపోయిన ఏపీలో గత ప్రభుత్వంలో సమీక్షలు పెట్టినా అధికారులకు ఫుల్ మీల్స్ అద్భుతమైన వెజ్ - నాన్ వెజ్ రుచులను పెట్టేవారు..
కానీ ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం జగన్ పెట్టిన కలెక్టర్లు- ఎస్పీల మీటింగ్ కు వచ్చిన అధికారులు చూసి షాకయ్యారు. మీటింగ్ లో మధ్యాహ్నం టైం వచ్చేసింది. జగన్ ఏం ఏర్పాట్లు చేశారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ప్యాకెట్ల రూపంలో భోజనం వచ్చేసింది. అది ఓపెన్ చేసి చూడగా సాధారణ రైస్- సాంబర్- పెరుగు మాత్రమే ఉందట.. స్వయంగా జగన్ టేబుల్ మీద కూడా ఇదే ప్యాకెట్ భోజనం ఉందట.. ఇలా మాటలోనే కాదు.. పొదుపులోనూ షాకిచ్చిన జగన్ వైఖరి చూసి అధికారుల నోట మాట రాలేదంటే నమ్మండి అని కథలు కథలుగా చెబుతున్నారు.