అనంతపురంలో టీడీపీ నేతలు చేసిన కుట్రను అధికారులు భగ్నం చేశారు. రూ.8 కోట్లు కాజేసేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను కమిషనర్ పీవీఎస్ మూర్తి భగ్నం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు వెలుగుచూశాయి.
అర ఎకరం స్థలానికి 9.63 కోట్ల పరిహారానికి తొలుత ప్రతిపదనలు జరగ్గా.. ప్రతిపాదనల తర్వాత స్థలం వివరాలను టీడీపీ నేతలు తారుమారు చేశారని పోలీసులు గుర్తించారు.
టీడీపీ హయాంలో చదరపు అడుగు 17000-30000 పెంచారు. డబ్బు రూ.9.63 కోట్ల నుంచి రూ.17 కోట్లకు పెంచారు. టీడీపీ నేతలకు అప్పటి జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సహకరించారని తేలింది. లక్షల రూపాయల ముడుపులు చేతులు మారాయని పోలీసుల విచారణలో తేలింది.
రూ.8 కోట్లు అదనంగా కాజేసే కుట్రను కమిషనర్ మూర్తి గుర్తించారు.పరిహారం రెట్టింపు చేసుకునేందుకు ప్రైం లోకేషన్ల వివరాలను టీడీపీ నేతలు జత చేయగా.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలనలో అక్రమాలు వెలుగుచూశాయి.
దీంతో మొత్తం రూ.17కోట్ల పరిహారం నిలుపుదల చేశారు. సమగ్ర వివరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ కమిషనర్ మూర్తి సిద్ధమయ్యారు.