1995 త‌ర్వాత పుట్టారా..అయితే వారి స్పీడే వేరు...

Update: 2019-10-23 01:30 GMT
కుర్రకారును చూసి కుళ్ళ‌కుంటున్నారు వారు.. అస‌లే ఉడుకు ర‌క్తం.. మారిన కాలం.. చేతిలో సెల్ ఫోన్‌.. చెవ్వుల్లో బ్లూటూత్‌.. ర‌య్యిమ‌ని క్ష‌ణాల్లో వెళ్ళేందుకు 150 సీసీని మించిన వాహనం.. ప‌ర్స్ నిండా కాసులు.. ఇంకేం కావాలి కుర్ర‌కారుకు.. అయ్యో ఇంకా ఏమీ అవ‌స‌రం లేదా.. అంటే ఆ ఒక్క‌టి మిస్స‌య్యార‌ని తోచింది.. ఇంత‌కు ఏదీ మిస్స‌య్యాం అనుకుంటున్నారా.. మ‌గువ‌ను మిస్స‌య్యాం.. మీరు మీ చాద‌స్తం కాకుంటే గీ వ‌య‌స్సులో ఏంటండి.. మ‌గువ గురించి ఆలోచించే ప‌రిస్థితిలో వారు లేరు.. అని అనుకుంటున్నారా... అయితే మీరు మ‌ద్యం క‌ప్పులో కాలేశారు.. అయ్యే మ‌ద్యం క‌ప్పు కాదండి.. ప‌ప్పులో కాలేసారు అనాలి.. ఏహో కాదు లేండీ రోజులు మారాయి అని చెప్పాం క‌దా.. ఇంకా బామ్మ కాలం నాటి పాత చింత‌కాయ ప‌చ్చ‌డి ముచ్చ‌ట్లేనా.. న‌వ‌త‌రం ముచ్చ‌ట్లు చెప్పాలి కానీ.. అందుకే ఔట్ డేటేడ్ వారితో ఇదే ఒచ్చిన చిక్కే ఇది.. ఇది నేటీ యువ‌త‌రం కోసం రాస్తుందే.. కాకుంటే ఆ యువ‌త‌రంను చేస్తున్న ప‌నుల‌ను చూసి మిడిల్ ఏజ్ వారు ఏమనుకుంటున్నారో చూస్తే ఒళ్ళు తిరిగే నిజాలు తెలుస్తాయి...

1991లో వ‌చ్చిన నూత‌న ఆర్థిక విధానాల‌తో భార‌త‌దేశమే మారిపోయింది. మ‌రో ఐదేళ్ళు గ‌డిచేస‌రికి భార‌త‌దేశం ప్ర‌పంచంలో ఓ కుగ్రామం అయిపోయింది.. గ్లోబ‌లైజేష‌న్ పుణ్య‌మా అని యువ‌త‌కు కార్పోరేట్ ఉద్యోగాలు - కాసులు కురిపించే క‌ళ్ళు చెదిరే ఐటీ జాబ్‌ లు. దీనికి తోడు యువ‌త ఆలోచ‌నా తీరే మారిపోయింది. ఒక్క రోజు చిన్న ప‌ని చేసినా మూడు రోజులు ఎంజాయ్ చేసే కాసులు కంటికి క‌నిపిస్తున్నాయి. అందుకే యువ‌త ఇప్పుడు మందు - విందు - పొందు కోసం ఆరాట ప‌డుతున్నారు. ఒక్క రోజులో అయిన ప‌రిచ‌యం కూడా బెడ్‌ రూం కు దారి తీసే స్థాయికి చేరిపోయింది.

అంటే యువ‌త‌రం చాలా స్పీడ్‌గా బెడ్‌ రూం వైపు దూసుకెళుతున్నారు. అందుకే ప‌రిచ‌యం అయిన మ‌రుక్ష‌ణం నుంచి ఛాటింగ్‌ - డేటింగ్ అంటూ బెడ్‌ రూంలో పొందు వ‌ర‌కు వెళుతున్నారు ఇప్ప‌టి యువ‌త‌. బెడ్రూం సుఖం కోసం యువ‌త ఎంత సాహ‌సం అయినా చేస్తున్నారు. ఈ తరం వారిని చూసి నేను ఎంతో అసూయ పడుతున్నాను. నా జూనియర్‌ సహచరులు నెలకు ఆరేడుగురితో తిరుగుతున్నారు. నేను పెళ్లికి ముందు ఒక్కసారి కూడా ఎవరితో లైంగిక అనుభం లేదు అని ఓ బెంగుళూరులో పనిచేస్తున్న 40 ఏళ్ల ఐఐటీ  గ్రాడ్యుయేట్‌ వాపోవ‌డం చూస్తుంటే మిడిల్ ఏజ్ వారు ఎంత‌గా చింత ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇప్పుడు సోష‌ల్ మీడియా పెరిగిపోయింది.. ఛాటింగ్ చేసుకునే వెసులుబాటు క‌లిగింది. దీంతో యువ‌తి యువ‌కులు క‌లుసుకోవ‌డానికి ఈజీగా మార్గం ఏర్ప‌డింది.. మా రోజుల్లో మాట్లాడుకోవాలంటే చదువుకునే చోట‌.. లేదా ప‌నిచేసే చోట‌నే..  2000 సంవత్సరంలో మా ఆఫీసులో కలుసుకున్న వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాకే అశ్చర్యం కలిగించింది అని ఎట్‌ మేక్‌ మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకులు సచిన్‌ భాటియా వ్యాఖ్యానించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2013లో తమ సంస్థ డేటింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ ట్రూలీమ్యాడ్లీ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఒకప్పుడు తమ ఆఫీసులో పనిచేసే స్త్రీలు - పురుషులే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకునే వారని - ఇప్పుడు అలాంటి ఉదంతాలు బాగా తగ్గి పోయాయని - బయట ఇతరులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండడమే అందుకు కారణం కావచ్చని ఆయన అన్నారు.

నేటి తరానికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంది. సమాజంలో రిస్కులు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కెరీర్‌ విషయంలో - రిలేషన్‌ షిప్‌ లో వారికంటూ ఓ క్లారిటీ ఉంది అని ఓ లాజిస్టిక్‌ సంస్థలో పనిచేస్తున్న 38 ఏళ్ల రాజేష్‌ చౌదరి అభిప్రాయపడ్డారు. బెడ్‌ రూమ్‌ లో నా పర్సనాలిటీ గురించి నేను ఏదీ దాచకుండా నీకు చెబుతాను  అని నాలుగంటే నాలుగు రోజుల క్రితమే పరిచయమైన ఓ 28 ఏళ్ల యువతి తనతో చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఢిల్లీకి చెందిన రచయిత్రి అంకిత ఆనంద్‌ తెలిపారు. మా తరంలో స్నేహానికే సమయం ఉండేది కాదు. కలుసుకునేందుకు కాఫీడేలు కూడా లేవు. ఈ తరాన్ని చూస్తే కొంత అసూయ వేస్తోంది అని 36 ఏళ్ల సౌమ్యా బైజాల్‌ అన్నారు.

ఈ తరం సంబంధాలను చూసి అసూయ పడుతున్న ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘నాకు ఇంకో జీవితం ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించగా - ఆయన పక్కనే ఉన్న ఈ తరానికి చెందిన ఆయన కుమారుడు తరం తరానికి తేడా ఎప్పుడూ ఉంటుంది. నా భవిష్యత్‌ తరాన్ని చూసి నేను కూడా అసూయ పడే రోజు వస్తుంది. అది తప్పదు అని వ్యాఖ్యానించడం సబబే కావచ్చు. ఏదేమైనా నేటి యువ‌త స్పీడ్‌ను చూసి మిడిల్ ఏజ్ వారు అసూయ ప‌డ‌టం స‌హాజ‌మే క‌దా మ‌రి.. ఏ ఏజ్ వారైనా ఇలాంటివి కోరుకోవడంతో త‌ప్పు లేదు కానీ, యువ‌త‌రం స్పీడ్‌ ను అందుకోవ‌డం మిడిల్ ఏజ్ వారికి సాధ్యం కాదు క‌దా.. పాపం మిడిల్ ఏజ్ వారిని చూస్తే జాలేస్తోంది.
 
Tags:    

Similar News