ఆస్పత్రి బిల్లు కట్టలేదని తాళ్తతో కట్టేశారు

Update: 2020-06-07 10:31 GMT
ఆస్పత్రి బిల్లు కట్టలేదని ఓ ఆస్పత్రి అమానుషంగా ప్రవర్తించింది. ఏకంగా ఓ వృద్ధుడిని తాళ్లతో కట్టేసి కర్కశంగా వ్యవహరించింది. ఈ అమానుషం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని ఆస్పత్రి సిబ్బంది బిల్లు చెల్లించలేదని ఓ వృద్ధుడి కాళ్లు, చేతులను బెడ్ కి కట్టేయడం మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది.

ఈ అమానుషం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లగా ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వృద్ధుడు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించామని.. 11వేల రూపాయల బిల్ అయ్యిందని.. చెల్లించలేకపోవడంతో సిబ్బంది ఇలా తాళ్లతో కట్టేశారని వృద్ధుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఇప్పటికే రూ.5వేలు కట్టినా తమను వదలడం లేదని వాపోయారు.

అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం వృద్ధుడికి బ్రెయిన్ డిజాస్టర్ కారణంగా తనకు తానుగా గాయపరుచుకుంటున్నాడని.. అందుకే కట్టేశామని తెలిపింది. అతడి బిల్లును మాఫీ చేశామని చెబుతోంది.

    

Tags:    

Similar News