ఉక్రెయిన్ పై 12 వ రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు బాంబు, క్షిపణి దాడులతో దద్ధరిల్లుతున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉక్రెయిన్లు ఇతర దేశాలకు తరలి వెళ్లారు. అంతే గాకుండా ఈ పోరాటంలో వేల సంఖ్యలో పౌరులు మృత్యువాత పడ్డారు.
పౌరులపై దాడులు జరపం అని చెప్తూనే రష్యా సేనలు పౌరులే లక్ష్యంగా చాలా ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడుతున్నారు. అయినా కానీ ఉక్రెయిన్ ఎక్కడ తగ్గకుండా ధీటైన జవాబు ఇస్తుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు చనిపోతున్నారు. ఇలా చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య వొలెనా జెలెన్స్కా ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం పై రష్యా చేపట్టింది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని అన్నారు. ఇది పూర్తి స్థాయిలో యుద్ధమని తెలిపారు. ఈ యుద్ధంలో చాలా మంది తమ పిల్లలను కోల్పోతున్నారని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ శాంతి కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ రష్యా మాత్రం యుద్ధం తో పాటు రక్తపాతాన్ని కోరుకుంటుందని వివరించారు. ఈ విధమైన చర్యలను ప్రపంచంలోని దేశాలు అన్నీ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ ను పెట్టారు.
ఉక్రెయిన్ పై రష్యన్ చేపట్టిన సైనిక చర్యలో వేలాది మంది సైనికులు చనిపోతున్నారని జెలెన్ స్కా అన్నారు. ఇది వేలాది మంది రష్యన్ తల్లులకు కడుపుకోత మిగులుస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్య కేవలం తమ దేశానికే పరిమితం కాదని ఆమె అన్నారు భవిష్యత్తులో రష్యా నుంచి ప్రపంచ దేశాలకు అణు బాంబు రూపంలో ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తు చేశారు ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు బాంబు గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసినా ఆమె వాటితో ప్రపంచ దేశాలకు తీవ్రమైన ముప్పు ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా రానున్న రోజుల్లో ఐరోపా దేశాలకు రష్యాతో ముప్పు తప్పదని చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే ప్రపంచంలో సేఫ్ ప్లేస్ అనేది ఈ భూమి మీద ఎక్కడ ఉండదని చెప్పారు.
ఉక్రెయిన్ పై ప్రస్తుతం బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. వేల సంఖ్యలో సైనికులను కోల్పోయిందని జెలెన్ స్కా గుర్తు చేశారు. ఈ దాడుల్లో రష్యా సేనలను తమ సైనికులు దీటుగా ఎదురుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలు తమకు మద్దతు ఇస్తున్నాయని తెలిపిన ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపారు.