వీడియో వైరల్: రాహుల్ ని ఇంటికి ఆహ్వానించిన మహిళ.. తర్వాత ఏమైంది..?

అవును... తాజాగా రాహుల్ గాంధీ ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో కాఫీ షాప్ వద్ద యజమానితోనూ, కస్టమర్లతోనూ ముచ్చటించారు రాహుల్ గాంధీ.

Update: 2025-01-09 14:21 GMT

గత కొంతకాలంగా.. ప్రధానంగా భారత్ జూడో యాత్ర సమయం నుంచి ప్రజలతో ఎక్కువగా మమేకమవుతున్నారు రాహుల్ గాంధీ. ప్రజలతో మమేకమవ్వడానికి వచ్చిన ఏ సందర్భాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల ఓ బార్బర్ షాప్ లో వ్యక్తిని కలిసిన రాహుల్.. అనంతరం అతడికి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ పంపించారు.

ఇదే సమయంలో... ఒకసారి చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు.. అతనితో కలిసి చెప్పులు కుట్టారు. ఇలా సామాన్యులను కలుసుకుంటూ వారితో మమేకమయ్యే ఏ సందర్భాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రముఖ కాఫీ షాప్ కు వెళ్లిన రాహుల్.. అక్కడి యాజమాన్యంతో ముచ్చటించారు.

ఇదే సమయంలో... వారి వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న కస్టమర్లను పలకరించి, ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ లో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో ఓ సన్నివేశం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్!

అవును... తాజాగా రాహుల్ గాంధీ ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో కాఫీ షాప్ వద్ద యజమానితోనూ, కస్టమర్లతోనూ ముచ్చటించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా స్వయంగా కోల్డ్ కాఫీ తయారు చేశారు. అనంతరం అక్కడున్న ఓ వృద్ధురాలు రాహుల్ గాంధీని తన ఇంటికి ఆహ్వానించింది. ఆ కాఫీ షాపు ఉన్న పైనే ఆమె నివాసం ఉంటున్నారు.

దీంతో.. కాసేపటి తర్వాత రాహుల్ ఆ వృద్ధురాలితో పాటు ఆమె ఇంటివద్దకు వెళ్లారు. అయితే.. ఈ సమయంలో సదరు మహిళ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగా... ఆమె రాహుల్ గాంధీని అయితే ఆహ్వానించారు కానీ.. ఇంటి తాళం చేవి తన వద్ద లేదన్న విషయాన్ని మరిచిపోయారు.

ఆ సమయంలో సదరు వృద్ధురాలు హైరానా పడ్డారు. అయితే విషయం గ్రహించి, ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న రాహుల్ గాంధీ.. వారితో ఫోటోలు దిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News