పారిపోలేదు నాదీ ఈ రక్తమే.. జెలెన్ స్కీ సతీమణి సూపర్ ట్వీట్

Update: 2022-03-02 11:30 GMT
ఉక్రెయిన్ ను రష్యా చుట్టు ముట్టింది. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో దాడికి దిగింది. ఈ భీకర యుద్ధం లో ఉక్రెయిన్... వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలుస్తోంది. మరో వైపు ఉక్రెయిన్ కు అండగా ఉంటామని అమెరికా వంటి అగ్ర దేశాలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ కష్ట కాలం లో దేశమే ముఖ్యమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోరాడుతున్నారు. దేశం తర్వాతే ఏదైనా అంటూ సైనికుల్లో యుద్ధ స్ఫూర్తిని నింపుతున్నారు. అయితే రష్యన్లు తొలి టార్గెట్ జెలెన్ స్కీ కాగా, ఆ తర్వాత ఆయన కుటుంబమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా జెలెన్ స్కీ కుటుంబం దేశం విడిచి పోయిందా? అని రష్యన్ మీడియా సందేహాలు వెలిబుచ్చింది.

రష్యా మీడియా లో వస్తున్న కథనాల కు తనదైన రీతిలో సమాధానం చెప్పారు జెలెన్ స్కీ సతీమణి ఒలినా జెలెన్ స్కా. తాను దేశం నుంచి పారి పోలేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. యుద్ధ సమయం లో దేశం లోనే ఉండి పోరాడుతున్నామని తెలిపింది. తనలోనూ ఉక్రెయిన్ రక్తమే ప్రవహిస్తోందని... ఈ ఆపద సమయంలో పారియేంత పిరికి పందలం కాదని పోస్ట్ చేశారు. తన బిడ్డల కోసమే ఈ అజ్ఞాత మంటూ ఉద్వేగ భరితమయ్యారు. దేశాన్ని ఈ యుద్ధం నుంచి కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ పై దాడిలో రష్యా ప్రధాన టార్గెట్ జెలెన్ స్కీ... ఆ తర్వాత ఆయన కుటుంబం అనే హెచ్చరికలు వచ్చాయని సమాచారం. దీనిపై జెలెన్ స్కీ కూడా ఓ ఎమోషనల్ వీడియో సందేశం ఇచ్చారు. కాగా ఆ భయంతో తన పిల్లలతో పాటు అజ్ఞాతంలో ఉంటున్నట్లు ఒలినా క్లారిటీ ఇచ్చారు.

అంతే కాకుండా యుద్ధ సమయం లో భర్తకు తోడుగా ఉంటూ... ఓ రహస్య బంకర్ లో తల దాచుకుంటున్నారు. ఒలినా ఈ కష్ట కాలంలోనే కాదు... అన్ని విషయాల్లోనూ భర్తకు అండగా ఉంటుంది. ఆయన రాజకీయ జీవితం లోనూ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తుంది.

జెలెన్ స్కీ, ఒలినా ఒకే ఊరిలో, ఒకే సంవత్సరంలో జన్మించారు. ఈ ఇద్దరూ క్లాస్ మేట్స్. కాగా వీరు 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు జెలెన్ రాజకీయాల వైపు దృష్టి మరల్చారు. వృత్తి రిత్యా ఒలినా ఓ ఆర్కిటెక్ట్. కాగా ఆమె రచనలు కూడా చేస్తారు. ఆయన రాజకీయ రంగంలో కొన్ని స్పూఫ్ వీడియోలు చేయడానికి ఒలినా  రచించారని చెబుతుంటారు.

ఇలా మొదటి నుంచి భర్తకు అండగా ఉండే ఆమె... ఈ యుద్ధ సమయం లోనూ దేశం లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా ఉక్రెయిన్ పౌరుల్లో ధైర్యం నింపే సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్ పోరాట పటిమను కొనియాడారు.

 
Tags:    

Similar News