ఇలాంటివి విన్నప్పుడల్లా.. కొంచెమైనా బుర్ర ఉండక్కర్లే అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటి మరి? ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి కనిపించిన సెకెండ్ హ్యాండ్ కారును కొనేయాలనుకున్న ఓ వ్యక్తి విక్రయదారుతో బేరసారాలకు దిగాడు. చివరికి కొంత మొత్తానికి ఫిక్స్ అయింది. ఇక డబ్బులు పంపిస్తే కారును విమానంలో పంపించేస్తానన్నాడా వ్యక్తి. సరేనంటూ తలూపి కొంచెమైనా ఆలోచించకుండా అడిగిన మొత్తం సమర్పించుకుని ఇప్పుడు తీరిగ్గా బావురుమంటున్నాడు.
ఇక, అసలు విషయానికొస్తే.. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన ఓ వ్యక్తి సెకెండ్ హ్యాండ్ లో మంచి కారు కొందామని ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ ఎక్స్ లో వెతుకుతున్నాడు. 2013 మోడల్ స్విఫ్ట్ డిజైర్ కారు అతడి కంటపడింది. అది కూడా లక్షన్నరకే అమ్మకానికి ఉండడంతో ‘భలే మంచి చౌకబేరము’ అని పాడుకుంటూ తన అదృష్టానికి తానే పొంగిపోయాడు. వెంటనే అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. కారు నచ్చిందని చెప్పాడు.
హైదరాబాదీ ఫోన్ ఎత్తిన కారు ఓనర్ తన పేరు వికాశ్ పటేల్ అని పరిచయం చేసుకున్నాడు. తాను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నానని - డబ్బులు పంపిస్తే కారును విమానంలో పంపించేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే, ఇందుకోసం తొలుత రూ.21 పంపించాల్సి ఉంటుందన్నాడు. సరేనంటూ తలూపి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అతడు అడిగిన రూ.21 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. డబ్బులు అందాయన్న వికాశ్ కారు డెలివరీకి సంబంధించిన మిగతా వివరాలను హైదరాబాద్ లో ఉంటే తన స్నేహితుడు సాహిల్ కుమార్ చూస్తాడంటూ అతడి ఫోన్ నంబరు ఇచ్చాడు.
ఇక, అప్పటి నుంచి మోసగాళ్ల బాదుడు మొదలైంది. కారు డెలివరీ కోసం సాహిల్ కు ఫోన్ చేస్తే మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత కానీ కారు ఇవ్వలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆ హైదరాబాదీ కారుకు చెల్లించాల్సిన మొత్తం డబ్బులు రూ.1.50 లక్షలను చెల్లించాడు. అయినప్పటికీ కారు డెలివరీ కాకపోవడంతో సాహిల్‌ను నిలదీశాడు. దీంతో ఇన్సూరెన్స్ డిపాజిట్ - ఇతర చార్జీలంటూ మరో రూ.80 వేలు పిండేశారు. ఇలా మొత్తంగా రూ.2.30 లక్షలు చెల్లించాక జీఎస్టీ పేరుతో మరో రూ.30 వేలు పంపాలని అడిగారు. అప్పటికి కానీ మనోడికి తత్త్వం బోధపడలేదు. మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంటూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు రాజస్థాన్ కు చెందిన భరత్‌పూర్ సైబర్ ముఠా పనేనని తేల్చారు.
భరత్ పూర్ లో వందలాది మంది సైబర్ క్రైమ్ ను ఉపాధి మార్గంగా మలుచుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో అత్యధిక భాగం ఇక్కడివేనని అంటున్నారు. ఓఎల్ ఎక్స్ లో మోసపోతున్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని - భరత్ పూర్ దొంగలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు.