ఇవాళ.. రేపటి రోజున రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యాయి అనటానికి తాజా వ్యవహారమే నిదర్శనం. ఓ పక్క పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి పైసా ప్రకటించటానికి మనసు ఒప్పని ప్రధాని మోడీ.. ఆ మధ్యన బీహార్ కు రూ.లక్ష కోట్ల చిల్లర వరకూ సాయం ప్రకటించేసి సంచలనం సృష్టించారు. బీహార్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసిన వెంటనే.. ఆయన నోటి వెంట జమ్మూకాశ్శీర్ రాష్ట్రానికి రూ.80వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి.. కాశ్శీర్ మీద తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చేతల్లో చేసి చూపించారు.
కాశ్శీర్ లాంటి బుజ్జి రాష్ట్రానికి రూ.80వేల కోట్లు ఇచ్చిన ప్రధాని మోడీ పెద్ద మనసుకు రాజకీయ పక్షాలు ఎంతగా ఖుషీ అయిపోవాలి. కానీ.. రాజకీయమే పరమావధిగా మారి.. ఓట్లు.. సీట్లు.. అధికారమే లెక్కగా మారిన నేపథ్యంలో.. రూ.80వేల కోట్ల ప్యాకేజీ అంటే మాటలు కాదు. అందులోకి జమ్మూకాశ్శీర్ లాంటి రాష్ట్రానికి ఇలాంటి భారీ ప్యాకేజీ చేసే మేలు ఎంతో. దశాబ్దాల పర్యంతం అభివృద్ధికి నోచుకోక.. నిరాశ.. నిస్పృహలో కూరుకుపోయిన కాశ్శీర్ యువతకు కొత్త ఆశలు రేకెత్తించాల్సిన అవసరం ఉంది. ఎంతోకాలంగా కేంద్రం చిన్న చూపుతో వేర్పాటువాదం వైపు మొగ్గు చూపుతున్న కొన్ని వర్గాలకు మందు వేయటానికి ఈ భారీ మొత్తం ఎంతో సాయం చేస్తుందని చెప్పొచ్చు.
ప్రజాస్వామ్యవాదులెవరైనా కాశ్శీర్ కు ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించి.. మోడీ నిర్ణయాన్ని అభినందిస్తారు. కానీ.. దరిద్రపుగొట్టు రాజకీయాల పుణ్యమా అని దశాబ్దానికి పైనే కాశ్శీర్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒమర్ అబ్దుల్లాకు మాత్రం మోడీ ప్రకటించిన ప్యాకేజీ ఒళ్లు మండిపోయేలా చేసింది. ఈ స్థాయిలో ప్యాకేజీ ప్రకటించి కాశ్శీర్ అభివృద్ధి చెందితే.. రేపొద్దున్న తనకు ఓట్లు వేసే వాళ్లు ఎవరుంటారని అనుకున్నట్లున్నారు.. వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తో ఒక ట్వీట్ చేసి పారేశారు. రూ.80వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మోడీని ఉద్దేశిస్తూ.. ‘‘ప్రధాని మోడీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కాశ్శీర్ సమస్యల్ని రూపాయిలు.. పైసలతో కొలుస్తున్నారు’’ అంటూ తన అసహనం వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయిల ప్యాకేజీ ప్రకటించి కూడా తిట్లు తినటం ప్రధాని మోడీకే చెల్లుతుందేమో.