మ‌ళ్లీ పెళ్లికి కోర్టుకు మాజీ సీఎం!

Update: 2018-03-02 06:21 GMT
మొద‌టి పెళ్లి విడాకుల వివాదంలో ఉండ‌టం.. మ‌రో పెళ్లి కోసం అనుమ‌తి ఇవ్వాలంటూ ఒక మాజీ ముఖ్య‌మంత్రి కోర్టును ఆశ్ర‌యించటం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. జ‌మ్ముకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా.. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కారు.

1994 సెప్టెంబ‌రు 1న ఆయ‌న పాయ‌ల్ ను పెళ్లాడారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. అయితే.. 2007లొ భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి.  ఈ నేప‌థ్యంలో వీరు కోర్టు వ‌ద్ద‌కు వెళ్లారు. త‌న‌కు త‌న భార్య‌తో విడాకులు కావాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

2016 ఆగ‌స్టు 30న విడాకుల కోసం దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను ట్ర‌య‌ల్ కోర్టు ప‌రిశీలించి.. తిర‌స్క‌రించింది. ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రోసారి కోర్టు మెట్లు ఎక్కారు. త‌మ వివాహ బంధం తిరిగి కోలుకోలేనంత దారుణంగా దెబ్బ తింద‌ని.. మ‌రో పెళ్లి చేసుకునేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా ఒమ‌ర్ కోర్టును కోరారు.

ఇదిలా ఉండ‌గా.. ఒమ‌ర్ తాజాగా దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను ప‌రిశీలించిన జ‌స్టిస్ సిద్ధార్థ్ మ్రిదుల్‌.. జ‌స్టిస్ దీపా శ‌ర్మ‌ల ధ‌ర్మాస‌నం ఈ విష‌యంపై ఆయ‌న భార్య పాయ‌ల్ స్పంద‌న‌ను కోరింది. తాను దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను త్వ‌ర‌గా విచారించాల‌ని కోర్టును కోరారు.

పెళ్లి త‌ర్వాత దాదాపు ప‌ద‌మూడేళ్లు క‌లిసి ఉన్న వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి. 2009 నుంచి వీరు వేరుగా ఉంటున్నారు. తాజాగా మ‌రో పెళ్లి కోసం ఒమ‌ర్ కోర్టును కోరిన నేప‌థ్యంలో వీరి దాంప‌త్య వివాదం మ‌ళ్లీ తెర మీద‌కు వ‌చ్చింది. మ‌రి.. దీనిపై పాయ‌ల్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News