రాజకీయ నాయకులకు రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతుంటారన్న భావన ఉంటుంది. అధినేతలకు అత్యున్నత సాంకేతికత గురించి అవగాహన తక్కువని అనుకుంటారు. కానీ.. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మాత్రం దీనికి పూర్తి భిన్నం. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆయన టెక్నికల్ గా ఎంత అప్ డేటెడ్ గా ఉంటారన్న విషయం బయటకొచ్చింది.
తన మొబైల్ ఫోన్లోని ఒక యాప్ సాయంతో అన్ షెడ్యూల్ ఫ్లైట్ ఒకటి శ్రీనగర్ లో ల్యాండ్ అయిన విషయాన్ని పసిగట్టిన ఆయన.. ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. అన్ షెడ్యూల్ విమానం ఒకటి శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యిందని.. రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటూ ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు. దీనికి బదులుగా ఒక నెటిజన్ బదులిస్తూ.. మెహబూబా.. రాం మాధవ్ ల మధ్య సీక్రెట్ మీటింగ్ కోసమే ఈ విమానం దిగి ఉంటుందని బదులిచ్చారు.
దీనికి తగ్గట్లే బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన రాంమాధవ్ జర్నలిస్టులకు కూడా చెప్పకుండా.. ప్రత్యేక విమానంలో శ్రీనగర్ లో అడుగు పెట్టటమే కాదు.. బీజేపీ.. పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మెహబూబాతో భేటీ కావటం గమనార్హం. ఈ విషయాన్ని తన మొబైల్ యాప్ సాయంతో ట్రాక్ చేసిన ఒమర్.. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించటంతో పాటు.. బీజేపీ.. పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన తాజా ప్రయత్నాలు బయటకు వచ్చాయి.