కరోనా.. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. కొవిడ్.. ఒమిక్రాన్.. డెల్టా.. ఒమిక్రాన్ బీఏ... ఒమిక్రాన్ బీఏ.2... ఒమిక్రాన్ ఎక్స్‌ఈ... ఒమిక్రాన్ బీఏ.4.. ఒమిక్రాన్ బీఏ.5.... ఇలా రోజుకో పేరుతో ప్రజలను పీడిస్తూనే ఉంది. కొత్త వేరియంట్లతో జనాల్లో అలజడి రేపుతూనే ఉంది ఈ మహమ్మారి. కరోనా ఇంకా పూర్తిగా నశించలేదని.. వేరియంట్లు, సబ్ వేరియంట్ల రూపంలో ఎక్కడో చోటా రోజూ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌కు రాగా.. అతడికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 సోకినట్లు సమాచారం.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4.. గత కొద్దిరోజులుగా ఈ పేరు దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో బాగా వినిపిస్తోంది. అక్కడ మరోసారి కరోనా విజృంభించడానికి కారణమైన ఈ వేరియంట్ ఇండియాలోనూ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 9న ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కొవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ (ఇన్సాకాగ్) ప్రకటించింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిబ్బంది జరిపిన వైద్య పరీక్షల్లో సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. అతని శాంపిల్స్ జీనోమ్ వ్యాలీకి పంపగా.. అతడికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 సోకినట్లు తెలిపింది. అతనిలో కరోనా లక్షణాలు ఏమీ కనిపించలేదని.. కానీ వైద్య పరీక్షల్లో మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది.
ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5.. అమెరికా, దక్షిణాఫ్రికాలో కరోనా ఉద్ధృతికి కారణమైన ఈ రెండు వేరియంట్లలో ఒకటి భారత్‌లో ప్రవేశించడం ఆందోళన కలిగించే విషయమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వేరింయట్ల ద్వారా ఐరోపాలో కూడా కేసులు పెరిగాయని తెలిపారు. రెండు డోసులు కరోనా టీకా తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ సోకుతోందని.. కానీ దీని తీవ్రత వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తక్కువగా ఉంటున్నట్లు చెప్పారు.
డెల్టా.. ఒమిక్రాన్‌ల కంటే బీఏ.4తో ఎక్కువగా ముప్పు ఉండదని.. కానీ వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ కెర్ఖోవ్ వెల్లడించారు. భారత్‌లో ఇంతకు ముందు ఒమిక్రాన్ వ్యాప్తి చెందడం.. ఇక్కడి ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విస్తృతం చేసి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం వల్ల బీఏ.4 ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అంటున్నారు.
ఏది ఏమైనా.. కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని.. అందుకే ప్రజలంతా మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.