ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ

Update: 2021-12-25 03:58 GMT
అమెరికా, యూరప్ లను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ కొత్త కరోనా వేరియంట్ ఇప్పుడు భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

ఒమిక్రాన్ కట్టడి కోసం కఠిన నిబంధనలను అమలు చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, ఒడిశా ప్రభుత్వాలు ఒమిక్రాన్ కట్టడి కోసం కొన్ని నియమ నిబంధనలు ప్రకటించాయి. అవి రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అమలు కానున్నాయి.

*దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు అమలు చేస్తూ కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. నేటి రాత్రి నుంచి ఇక్కడ కూడా కర్ఫ్యూ అమల్లోకి రానుంది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాత్రిపూట కర్ఫ్యూని విధించింది. అంతేకాదు ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడవద్దని ఆంక్షలు పెట్టింది. వివాహ వేడుకల్లో 100 మందికి మాత్రమే అనుమతిచ్చింది. ఇక సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీసే నిర్ణయం తీసుకుంది. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్ లను అనుమతించింది.

-ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అంతేకాదు శుభకార్యాలకు, పెళ్లిళ్లు వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్య ను కూడా పరిమితం చేశారు. కేవలం 200 మంది మాత్రమే అనుమతిస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

-గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, భావ్ నగర్, గాంధీనగర్, జూనాగఢ్ లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.

-ఒక ఒడిషాలో నేటి నుంచి ఆంక్షలు పెట్టారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు నుంచి జనవరి 2వ తేదీ వరకూ ఆంక్షలు అమలు చేయనున్నారు. వేడుకల్లో 50 మంది కంటే ఎక్కువ మంది హాజరు కావద్దొని స్పష్టం చేశారు.

-హర్యానాలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ పెట్టారు. పెళ్లిళ్లు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరు కావాలని కోరారు.

దేశంలో ఇప్పటికే తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు పలు రాష్ట్రాలు కర్ఫ్యూ పెట్టడంతో మళ్లీ లాక్ డౌన్ దిశగా సాగుతోంది.
Tags:    

Similar News