హేమ‌పై వ్యాఖ్య‌ల‌ను మ‌రాఠా ఎమ్మెల్యే స‌ర్దేశారుగా!

Update: 2017-04-18 11:18 GMT
బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి - ప్ర‌స్తుతం పార్ల‌మెంటు మెంబర్‌ గా ఉన్న హేమామాలినిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మ‌హారాష్ట్ర ఎమ్మెల్యే ఓం ప్ర‌కాశ్ బాబూరావు.... త‌న‌ ఆవేద‌న‌లో నిజ‌ముంద‌న్న వాద‌న కూడా వినిపించేలా స‌రికొత్త వ్యాఖ్య‌లు చేశారు. అయితే హేమామాలిని మ‌ద్య‌పానంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌ర్దేశారు. మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్ న‌గ‌ర్ జిల్లా శ్రీరాంపూర్‌ లో జ‌రిగిన రైతుల ర్యాలీలో పాల్గొన్న ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాసేప‌టి క్రితం తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ రైతుల‌ను ప‌ట్టించుకోని స‌మాజంపై విరుచుకుప‌డ్డారు.

గ‌తంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై మాట్లాడిన సంద‌ర్భంగా... మద్యంతాగే అలవాటున్నవారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం దారుణమని, అలాగైతే హేమమాలిని రోజూ మద్యం తాగుతారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు రాగా, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. తాను హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని, సినిమాల్లో ఆమె మద్యం తాగుతార‌ని మాత్ర‌మే చెప్పానని అన్నారు.

ఇక రైతుల ఆత‌హ‌త్య‌ల‌పై స‌మాజం ఏ విధంగా స్పందిస్తుంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన బాబూరావు... దేశంలో చాలామంది ప్రజలు క్రికెట్‌ లో సచిన్‌ టెండుల్కర్‌ ప్రతి పరుగును లెక్కకట్టి గుర్తు పెట్టుకుంటారు. కానీ పొలాల్లో కష్టపడుతున్న రైతులు గురించి కనీసం ఆలోచించరు అని ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లతో క్రికెట్ క్రీడ‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే ఆలోచింప‌జేసేవిగానే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి చాలా మంది క్రికెట్‌ పై చూపిస్తున్న ఆస‌క్తి... త‌న ప‌క్కింటిలోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబం గురించి ఆలోచించడం లేద‌న్న బాబూరావు వాద‌న నిజ‌మేన‌ని కూడా చెప్ప‌క త‌ప్పదు. మ‌రి బాబూరావు ఆవేద‌న ఎంత‌మందిని క‌దిలిస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News