బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 భారతదేశానికి క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్ వాసులు డిమాండ్ చేశారు! పాకిస్తాన్ కు చెందిన భగత్ సింగ్ మొమోరియల్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఈ డిమాండ్ తెరమీదకు తెచ్చింది. స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్ - రాజ్ గురు - సుఖ్ దేవ్ 86 వర్దంతి సందర్భంగా లాహోర్ లోని ఫవారా చౌక్ లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి పోరాట యోధులకు నివాళి అర్పించిన అనంతరం భగత్ సింగ్ మొమోరియల్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ సభ్యులు మాట్లాడుతూ బ్రిటన్ రాణి నుంచి క్షమాపణలు కోరారు.
1931లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్ ను ఉరితీయడం పట్ల ప్రస్తుత బ్రిటన్ రాణి భారత్‌కు క్షమాపణలు చెప్పాలని సదరు సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం భారత్ - పాకిస్తాన్ లో ఉంటున్న స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సైతం ఎలిజబెత్ క్షమాపణలు చెప్పాలని వారు కోరారు. కాగా, ఈ కార్యక్రమానికి ఓ వర్గానికి చెందిన మతస్థుల నుంచి బెదిరింపులు వచ్చాయి. అయితే వారు లాహోర్ హైకోర్టును ఆశ్రయించగా భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పోలీసుల సమక్షంలో వర్దంతి నిర్వహించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/