సీఎం అడిగారు.. యాప్ ను తీసేసిన గూగూల్

Update: 2019-11-21 06:51 GMT
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన డిమాండ్ కు టెక్ దిగ్గజం గూగుల్ తలవంచింది.  సీఎం చెప్పినట్లే తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ యాప్ ఏమిటి? ఎందుకని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంట్రీ ఇచ్చారు?  అందుకు గూగుల్ ఎందుకు డిలీట్ చేసిందన్న విషయాల్లోకి వెళితే..

2020 సిక్కు రెఫరెండం పేరుతో యాప్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్ లో ఉండేది. ప్రత్యేక ఖలిస్థాన్ కు అనుకూలంగా ఉన్న వారు తమ మద్దతును ఓటింగ్ రూపంలో చెప్పేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ తీరుపై అనుమానాలు వ్యక్తమైన వేళ.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం డీఐటీఏసీ ల్యాబ్ లో ఈ యాప్ ను కుణ్ణంగా పరీక్షలు జరిపారు.

ఈ యాప్ లో ఓటింగ్ చేసిన వారి సమాచారాన్ని సిక్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటు సంస్థ అధ్యర్వంలో నడిచే వెబ్ సర్వర్ లో డేటా నిక్షిప్తం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో అలెర్ట్ అయిన పంజాబ్ ముఖ్యమంత్రి.. ఈ యాప్ కారణంగా భారత్ లో తలెత్తే పరిణామాల్ని పేర్కొంటూ.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డిలీట్ చేయాలన్నారు.

భారత సమాచార సాంకేతికత చట్టం 79(3) బి ప్రకారం ఈ యాప్ ను భారత్ లో నిర్వహించటం చట్టవిరుద్ధంగా పేర్కొన్నారు. దీనికి స్పందించిన గూగుల్.. సీఎం పేర్కొన్న అంశాల్ని పరిశీలించి.. అవన్నీ సరిగా ఉండటంతో ఈ యాప్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Tags:    

Similar News