కరోనా వైరస్ .. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. చైనా లో ఎదో ఒక మూల ప్రారంభమై , ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ , మొత్తంగా ప్రపంచాన్ని నాశనం చేసింది , చేస్తోంది. అయితే , సాంకేతికంగా ,వైజ్ఞానికంగా ఎంతగా అభివృద్ధి చెందినా కంటికి కనిపించని కరోనా ను అంతం చేయడం లో మాత్రం ప్రపంచం మొత్తం విఫలం అయింది. ప్రస్తుతం వ్యాక్సిన్ కొంతమేర కట్టడి చేస్తున్నా కూడా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. అలాగే కొందరు నిపుణులు థర్డ్ వేవ్ రాబోతోంది అంటూ కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే .. సైన్స్ పరంగా ఇంత అభివృద్ధి చెందినా కరోనా ను అంతం చేయడానికి నానా అవస్థలు పడుతుంటే .. ఈ సమయంలో కూడా ఇంకా కొందరు మూఢనమ్మకాలని నమ్ముతూ కరోనా పీడ విరగడ కావడానికి అంటూ నానా రచ్చ చేస్తూ ఇంకా కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారు.
మూర్ఖత్వం తో కరోనా ను క క్షుద్రపూజలు, శాంతిపూజలతో తరమికొట్టాలని చూస్తున్నారు. ఈ తరహా సంఘటనలు కేవలం మన దేశంలో మాత్రమే కనిపిస్తాయేమో మరి. ఈ మద్యే కర్నాటకలోని ఓ ప్రాంతంలో భారీ విగ్రహం కట్టారు. ఆ దేవత పేరు కరోనా తల్లి. దాదాపు 40 అడుగుల ఆ కరోనా తల్లికి శాంతిపూజలు చేశారు. దేశాన్ని విడిచిపోవాలంటూ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులతో పాటు వేదపండితులు, అర్చకులు చాలామంది పాల్గొన్నారు. ఈ ఘటన జరిగింది ఇండియా లో ఫారెన్ కంట్రీగా , ఐటి హబ్ గా పేరు తెచ్చుకున్న బెంగుళూరు కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే. అయితే , ఆ పూజలు చేసిన తర్వాత కరోనా తల్లి పుణ్యం ఫలం కారణం గా ఎంతమందికి కరోనా తగ్గిందో ఆ కరోనా తల్లికే తెలియాలి. ఈ ఘటన తో పాటుగా మరో ఘటన అదే రాష్ట్రంలో జరిగింది. కరోనాకు క్షుద్రపూజలు చేశారు. మట్టితో కరోనా వైరస్ ను పోలిన బొమ్మ తయారుచేసి, దాని చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు చల్లి నానా హంగామా చేశారు. ఇక్కడితో ఆగలేదు వ్యవహారం. ఓ మేకను కూడా బలిచ్చి అక్కడే వదిలి వెళ్లారు.
ఇక అక్కడితో ఆగిపోలేదు. ఏపీలో కూడా ఓ ఘటన జరిగింది. ఏ వ్యాధినైనా, ఎంత పెద్ద రుగ్మతనైనా ప్రార్థనలతో నయం చేస్తామంటూ ఓ సామాజిక వర్గంలో ఎప్పటికప్పుడు కథనాలు రావడం పలు సందర్భాల్లో అందరం చూస్తూనేఉంటాం. కాళ్లు లేని వాళ్లకు నడక, కళ్లు లేని వాళ్లకు చూపు తెప్పించిన వీడియోలు చాలానే సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి కూడా . ఇప్పుడు అదే వర్గానికి చెందిన ఓ మతప్రబోధకుడు శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించాడట.అక్కడ ఏకంగా ఓ మినీ కరోనా రోగుల సమ్మేళనాన్ని తలపించిందట. ఇలా చెప్తే ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫస్ట్ వేవ్ లో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి అంటే .. తెలియక చేసిండోచ్చు అనుకోవచ్చు కానీ, ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కూడా మందులకే లొంగని కరోనా మంత్రాలకు లోగుంతుంది అంటూ పూజలు , ప్రార్ధనలు చేస్తూ మూర్ఖంగా వ్యవహరించడం వారి విజ్ఞతకే వదిలేయాలి.