ఏపీ సీఎం జగన్ విషయంపై.. రాష్ట్ర వ్యాప్తంగా మేధావుల నుంచి రాజకీయ నాయకుల వరకు చర్చ సాగు తోంది. ఎందుకంటే.. ఆయన ఎప్పుడూ.. ఇంతలా `స్పందించింది` లేదు. రాష్ట్రంలో గతంలో డాక్టర్ సుధా కర్ ఘటన జరిగింది. దేవాలయాలపై దాడులు జరిగాయి.. స్థానిక ఎన్నికల్లో దాడులు జరిగాయి. వైసీపీ , టీడీపీ నాయకులు రోడ్డున పడి విమర్శించుకున్నారు. ఇక, టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఇటీవల కూడా కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ.. జగన్ ఎక్కడా ఎప్పుడూ.. రియాక్ట్ అయిం ది లేదు. ఇది వాస్తవం. గత రికార్డులను చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి.
చంద్రబాబు నుంచి అనేక మంది నాయకులు.. ఇటు బీజేపీ నేత సోము వీర్రాజు కూడా జగన్‌పై అనేక కామెంట్లు చేశారు. ఇక, మంత్రులపైనా పలువురు నాయకులు విమమర్శలు చేశారు. అరెయ్.. ఒరేయ్.. అనుకోవడం కామన్ అయిపోయింది. అయితే.. ఆయా సందర్భాల్లో ఏనాడూ స్పందించని..జగన్.. ఒకవేళ స్పందించినప్పటికీ.. ఎప్పుడో.. మూడు నెలలకో.. నాలుగు నెలలకో.. ఆయన స్పందించేవారు. అది కూడా ఏదైనా.. చిన్న మాట అనేసి వదిలేసేవారు. కానీ, ఇప్పుడు.. తాజాగా జరిగిన ఘటనలో మాత్రం జగన్ 24 గంటలు కూడా గడవకముందే.. స్పందించడం.. మళ్లీ రెండో రోజూ దీనిపైనే మాట్లాడడం వంటివి చూస్తే.. ఆయన ఒకింత లోతుగా.. హర్ట్ అయినట్టు తెలుస్తోంది.
వరుసగా రెండు రోజుల పాటు ఒకే విషయంపై జగన్ స్పందించిన ఘటనలు కానీ.. సందర్భాలు కానీ మనకు కనిపించవు. కానీ.. టీడీపీ నాయకుడు.. పట్టాభి చేసిన వ్యాఖ్యలపై మాత్రం బుధవారం.. ప్రభుత్వ పథకాన్ని ప్రారంభిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తాము చేయలేదని.. బండబూతులు మాట్లాడలేదని.. తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నామని.. అయినప్పటికీ.. ఎప్పుడూ ఇలా కామెంట్లు చేయలేదని అన్నారు. ఆ వ్యాఖ్యలతోనే జగన్ చాలా హర్ట్ అయ్యారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపించింది. ఇక, రెండోరోజు కూడా వరుసగా గురువారం.. జగన్ ఉదయాన్నే పాల్గొన్న పోలీసు అమరవీరుల దినోత్సవంలో మరింత లోతుగా వ్యాఖ్యానించి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్.. ఇప్పటి వరకు ఎన్నడూ రియాక్ట్ కాని విధంగా స్పందించడం.. తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆయన మనసును కలిచి వేశాయని.. చెప్పేందుకు ఇంతకన్నా మరేం నిదర్శనం కావాలనివారు అంటున్నారు. గతంలో ఆయనను అరాచకవాది అన్నా.. క్రిమినల్ అన్నా.. జైలు పక్షి అన్నా.. నా కొడుకు అన్నా..కూడా ఇలా రియాక్ట్ కాలేదని.. చెబుతున్నారు. సో.. దీనిని బట్టి.. మున్ముందు.. పరిణామాలు మరింత తీవ్రంగా మారే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.